అదృష్టం తీసుకొచ్చిన సంక్రాంతి పండుగ.. ఈ రాశుల వారికి రాజయోగం!
samatha
11 January 2024
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో సంబురంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి.ఇది చాలా మందికి ఇష్టమైన ఫెస్టివల్.
జనవరి13న భోగి, 14న మకర సంక్రాంతిని ప్రజలందరూ జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం పండుగ వస్తూనే కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకొచ్చింది.
మకర సంక్రాంతి ఈ సారి పుష్య నక్షత్రంలో వచ్చిందంట. అందువలన మూడు రాశుల వారికి రాజయోగం కలగనుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి సంక్రాంతి పండుగ అదృష్టం తీసుకొచ్చింది. మకర సంక్రాంతి రోజున ఏర్పడే సంయోగం వలన వీరికి ఆర్థికంగా చాలా బాగుంటుందంట. వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోతుంది.
తుల రాశి : ఈ రాశి వారికి మకర సంక్రాంతి రోజున ఏర్పడే సమయోగం వలన ఆరోగ్యం బాగుండటమే కాకుండా, ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోతాయి, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.
అంతే కాకుండా చాలా కాలంగా ఎవరైతే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు పండితులు.
మీన రాశి వారికి సంక్రాంతి పండుగ వస్తూనే రాజయోగం తీసుకొచ్చింది. చాలా రోజుల నుంచి ఈ రాశి వారు ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో, వారికి వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది.
పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం. వ్యాపారంలో, ఉద్యోగంలో అన్నింటిలోను మీకు కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది.