10 నెలలుగా కనిపించకుండా పోయిన మహిళ.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే.. వామ్మో..
ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.. ఓనర్ ఎక్కడో ఉంటాడు.. ఇదే మంచి తరుణం అనుకున్నాడు.. ఓ అమ్మాయితో లివింగ్ రిలేషన్‌షిప్ మొదలు పెట్టాడు.. ఆమె పెళ్లి చేసుకోమని.. నిలదీయడంతో ఆమెను చంపి.. ఫ్రిడ్జ్ లో మృతదేహాన్ని దాచాడు.. ఆ తర్వాత రూమ్ ఖాళీ చేశాడు.. చివరకు .. 10 నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది..
ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.. ఓనర్ ఎక్కడో ఉంటాడు.. ఇదే మంచి తరుణం అనుకున్నాడు.. ఓ అమ్మాయితో లివింగ్ రిలేషన్‌షిప్ మొదలు పెట్టాడు.. ఆమె పెళ్లి చేసుకోమని.. నిలదీయడంతో ఆమెను చంపి.. ఫ్రిడ్జ్ లో మృతదేహాన్ని దాచాడు.. ఆ తర్వాత రూమ్ ఖాళీ చేశాడు.. చివరకు .. 10 నెలల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ నగరంలో వెలుగుచూసింది.. ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్‌లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది.. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సంజయ్ తన స్నేహితుడు వినోద్‌తో కలిసి ప్రతిభను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్‌లో దాచాడని.. దుర్వాసన రావడంతో 10 నెలల తర్వాత ఈ విషయం వెల్లడైనట్లు తెలిపారు
బ్యాంక్ నోట్ ప్రెస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ ధామ్ కాలనీలో ఈ ఇల్లు ఉందని ఎస్పీ తెలిపారు. “మహిళకు 30 ఏళ్లు ఉంటాయి. జూన్ 2024లో ఆమె హత్యకు గురైందని మేము అనుమానిస్తున్నాము. దుర్వాసన రావడంతో, ఇరుగుపొరుగు వారు ఇంటి యజమానిని పిలిచారు. మహిళ మృతదేహం రిఫ్రిజిరేటర్‌లో కనుగొన్నాం.. ఆ తర్వాత ఆయన పోలీసులను అప్రమత్తం చేశారు’’ అని దేవాస్ సూపరింటెండెంట్ పునీత్ గెహ్లాట్ విలేకరులతో అన్నారు. చీర కట్టుకున్న మహిళ, ఆభరణాలు ధరించి ఉందని.. ఆమె మెడకు ఉచ్చుతో పాటు చేతులు కట్టివేశారని.. గతేడాది హత్య చేసి ఉండవచ్చని తెలిపారు.
ఇండోర్‌లో నివసించే ధీరేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి ఇంటి యజమాని అని ఎస్పీ తెలిపారు. శ్రీవాస్తవ తన ఇంటిని జూన్ 2023లో ఉజ్జయినికి చెందిన వ్యక్తి సంజయ్ పాటిదార్‌కి అద్దెకు ఇచ్చారు.. ఒక సంవత్సరం తర్వాత, పాటిదార్ ఇల్లు ఖాళీ చేసాడు.. కానీ తన వస్తువులను స్టడీ రూమ్, మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉంచాడు.. ఈ రూమ్ ను తర్వాత ఖాళీ చేస్తానని నిందితుడు శ్రీవాస్తవతో చెప్పాడని.. కానీ ఖాళీ చేయలేదని.. పోలీసు అధికారి గెహ్లాట్ తెలిపారు..
పాటిదార్ ఇంటికి ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు.. అయితే.. ఇటీవల, ప్రస్తుత అద్దెదారు ఇంటిలోని ఈ భాగాన్ని తెరవమని ఇంటి యజమానిని అడిగాడు. యజమాని ఇంటిలోని ఈ భాగాన్ని అద్దెదారుకు చూపించాడు.. కానీ, పాటిదార్ వస్తువులు లోపల ఉన్నందున దానికి మళ్ళీ తాళం వేశాడు. బుధవారం విద్యుత్ సరఫరా స్విచ్ ఆఫ్ చేసారు.. రిఫ్రిజిరేటర్ పనిచేయడం మానేసినప్పటి నుంచి దుర్వాసన ఎక్కువ అయిందని.. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన రావడంతో వెంటనే.. తనఖీ చేయగా.. అసలు విషయం వెలుగుచూసిందని.. పోలీసు అధికారి సోలంకి తెలిపారు. పాటిదార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..