వైసీపీ హడావిడి ఓ జోక్: యామిని సాధినేని
ఎన్నికల ఫలితాలు కూడా రాకుండానే అధికారంలోకి వచ్చేశామంటూ వైసీపీ నేతలు చేస్తున్న హడావిడి చూస్తుంటే నవ్వొస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. ఏపీ ప్రజలు జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రానుందని.. ఇది రాసిపెట్టుకోండి అంటూ ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఇక కేంద్రంలోనూ ఎన్డీయేకు ఎగ్జిట్ పోల్స్ చెప్పినన్ని స్థానాలు రావని.. ఆ కూటమికి రెండు వందల స్థానాలు […]
ఎన్నికల ఫలితాలు కూడా రాకుండానే అధికారంలోకి వచ్చేశామంటూ వైసీపీ నేతలు చేస్తున్న హడావిడి చూస్తుంటే నవ్వొస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. ఏపీ ప్రజలు జగన్‌కు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రానుందని.. ఇది రాసిపెట్టుకోండి అంటూ ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఇక కేంద్రంలోనూ ఎన్డీయేకు ఎగ్జిట్ పోల్స్ చెప్పినన్ని స్థానాలు రావని.. ఆ కూటమికి రెండు వందల స్థానాలు రావడం కూడా కష్టమని తెలిపారు. ఎన్నికల ఫలితాల తరువాత మోదీ పర్మినెంట్‌గా హిమాలయాలకు వెళ్లి.. ఓ గుహను శాశ్వతంగా అద్దెకు తీసుకొని అక్కడే ఉండాలని సెటైర్లు విసిరారు.