సీఈవోకు జనసేన ఫిర్యాదు!
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో రౌడీమూకలు కౌంటింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయే అవకాశం ఉందని జనసేన నాయకులు ఆరోపించారు. జనసేన నేత మాదాసు గంగాధర్ సీఈవో ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. కృష్ణా, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలని కోరారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఈవో స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సజావుగా సాగేందుకు జనసేన సహకరిస్తుందని తెలిపారు. ఎగ్జిట్ […]
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో రౌడీమూకలు కౌంటింగ్ కేంద్రాల వద్ద రెచ్చిపోయే అవకాశం ఉందని జనసేన నాయకులు ఆరోపించారు. జనసేన నేత మాదాసు గంగాధర్ సీఈవో ద్వివేదిని కలిసి ఫిర్యాదు చేశారు. కృష్ణా, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద అదనపు భద్రత కల్పించాలని కోరారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఈవో స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. కౌంటింగ్ సజావుగా సాగేందుకు జనసేన సహకరిస్తుందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌ను జనసేన పట్టించుకోదన్నారు. మార్పు కోసం పోటీ చేసిన జనసేనకు ఎమ్మెల్యే సీట్ల కంటే ప్రజల ఓట్లే ఎక్కువగా ఉన్నాయన్నారు. మార్పుకు ఈ ఎన్నికలు నాంది పలికాయని తెలిపారు.