ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా అలీ..?

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసిన సినీ ప్రముఖులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే నటుడు పృథ్వికి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక తాజాగా కమెడియన్ అలీని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌‌గా ప్రకటించనున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్న అలీ.. అన్ని మీటింగ్స్‌లోనూ యాక్టివ్‌గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక గతంలో ఏపీఎఫ్‌డీసీ […]

ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా అలీ..?
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 30, 2019 | 6:21 PM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసిన సినీ ప్రముఖులపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే నటుడు పృథ్వికి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక తాజాగా కమెడియన్ అలీని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌‌గా ప్రకటించనున్నట్లు సమాచారం. ఎన్నికల ముందు వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్న అలీ.. అన్ని మీటింగ్స్‌లోనూ యాక్టివ్‌గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇక గతంలో ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన టీడీపీ లీడర్ ఇటీవలే తన పదవికి రాజీనామా ఇచ్చిన సంగతి తెలిసిందే. అటు రాజానగరం ఎమ్మెల్యే అయిన జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.