ఏపీలో హస్తానికి ఆశాకిరణమేనా..?

ఏపీలో కాంగ్రెస్ కు ఇలాంటి దుస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. నేతలే కాదు పార్టీ కండువాలు కూడా కలకనలేదేమో..ఒక్క సీటు కాదు కదా…పార్టీ నడపడానికి నేతలే కరువయ్యారు ఇప్పుడు. ఇప్పటికే నడిసంద్రంలో ఉన్న పార్టీని ఓటమికి బాధ్యత అంటూ రఘువీరారెడ్డి చేతులెత్తేశాడు. ఇప్పుడు ఏపీలో నిండా మునిగిన కాంగ్రెస్ నావకు కెప్టెన్ ను వెతికే పనిలో ఉన్నారట హై కమాండ్ పెద్దలు. రాహుల్ కు మద్దతుగా ఓటమికి నైతిక బాధ్యతగా పార్టీ బాధ్యతల నుంచి రఘువీరా […]

  • Ravi Kiran
  • Publish Date - 5:16 pm, Tue, 30 July 19
ఏపీలో హస్తానికి ఆశాకిరణమేనా..?

ఏపీలో కాంగ్రెస్ కు ఇలాంటి దుస్థితి వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. నేతలే కాదు పార్టీ కండువాలు కూడా కలకనలేదేమో..ఒక్క సీటు కాదు కదా…పార్టీ నడపడానికి నేతలే కరువయ్యారు ఇప్పుడు. ఇప్పటికే నడిసంద్రంలో ఉన్న పార్టీని ఓటమికి బాధ్యత అంటూ రఘువీరారెడ్డి చేతులెత్తేశాడు. ఇప్పుడు ఏపీలో నిండా మునిగిన కాంగ్రెస్ నావకు కెప్టెన్ ను వెతికే పనిలో ఉన్నారట హై కమాండ్ పెద్దలు.

రాహుల్ కు మద్దతుగా ఓటమికి నైతిక బాధ్యతగా పార్టీ బాధ్యతల నుంచి రఘువీరా తప్పుకున్నారు.అయితే ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించని హస్తం హైకమాండ్ కొత్త సారథికోసం సెర్చ్ చేస్తోందట. ఎంత వెదికిన పార్టీని నడిపే నేతలే కనిపించడం లేదని బాధపడుతున్న అధిష్టానానికి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆశాకిరణంలా కనిపిస్తున్నారట.

విభజన సమయంలో సొంత కుంపటి పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి సీన్ రివర్స్ కావడంతో మళ్లీ సొంత గూటికే చేరారు…మొన్నటి ఎన్నికల్లో సైలెంట్ గానే ఉన్నారు. కనీసం పోటీకి కూడా ఆసక్తి చూపలేదు. అయితే ఇటీవలే ఏపీపై ఫోకస్ చేసిన బీజేపీ కిరణ్ పై కాషాయ కండువ వేసే పనిలో ఉందట. ఇదే విషయం ఇప్పుడు ఏపీలో ఆ నోటా ఈ నోటా వినపడుతోదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ టైంలో నల్లారివైపు చూస్తోన్న హైకమాండ్ పార్టీ మారకుండా చేయడంతో పాటు పీసీసీ బాధ్యతలు కూడా తీసుకునేలా చెయ్యాలనే టాస్క్ లో ఉన్నారట.

మరి అధిష్టానం ఆసక్తిగానే ఉన్నా ..కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.