AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ మెడ్‌టెక్ జోన్‌పై గడ్కరీ, సెహ్వాగ్ ప్రశంసలు

వైజాగ్‌లోని మెడ్‌టెక్ జోన్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో ప్రశంసలు గుప్పించారు. దేశ అవసరాలను తీర్చడంతోపాటు.. వైద్య పరికరాలను ఎగుమతి చేసే లక్ష్యంతో విశాఖలో ఏపీ మెడిటెక్ జోన్ ఏర్పాటైన విషయం తెలిసిందే. ‘‘మన దేశం ఏటా రూ. 50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకునేది. ఈ పరిస్థితి విశాఖలోని మెడికల్ డివైజెస్ క్లస్టర్ కారణంగా మారింది. దేశంపై దిగుమతుల భారం తగ్గింది. ఎంఆర్ఐ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి రూ.4.5 కోట్లు […]

ఏపీ మెడ్‌టెక్ జోన్‌పై గడ్కరీ, సెహ్వాగ్ ప్రశంసలు
Ram Naramaneni
|

Updated on: Jul 31, 2019 | 12:48 AM

Share

వైజాగ్‌లోని మెడ్‌టెక్ జోన్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో ప్రశంసలు గుప్పించారు. దేశ అవసరాలను తీర్చడంతోపాటు.. వైద్య పరికరాలను ఎగుమతి చేసే లక్ష్యంతో విశాఖలో ఏపీ మెడిటెక్ జోన్ ఏర్పాటైన విషయం తెలిసిందే.

‘‘మన దేశం ఏటా రూ. 50 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకునేది. ఈ పరిస్థితి విశాఖలోని మెడికల్ డివైజెస్ క్లస్టర్ కారణంగా మారింది. దేశంపై దిగుమతుల భారం తగ్గింది. ఎంఆర్ఐ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి రూ.4.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేది. మనవాళ్లు రూ.98 లక్షలకే వాటిని రూపొందిస్తున్నారు. వాటి ఉత్పత్తి కోసం ఏపీ సీఎంకు ప్రతిపాదనలు పంపాం. ఈ క్లస్టర్‌తోపాటు మిగతా రాష్ట్రాల్లోనూ 5-6 మెడికల్ క్లస్టర్లను ఏర్పాటు చేసే దిశగా యోచిస్తున్నాం. వైజాగ్ క్లస్టర్ విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశాం’’అని నితిన్ గడ్కరీ పార్లమెంట్‌లో ప్రసంగించారు.

మంత్రి మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసిన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపాడు. ఏపీ మెడ్‌టెక్ జోన్ లాంటి అనువైన వాతావరణం, డాక్టర్ జితేందర్ సింగ్ శర్మ లాంటి హెల్త్ ఛాంపియన్లు దేశాన్ని హెల్త్ సూపర్ పవర్‌గా రూపొందించాలనే కలను సాకారం చేస్తున్నారంటూ వీరూ ప్రసంశలు గుప్పించాడు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం, నితిన్ గడ్కరీలను ఆయన ట్యాగ్ చేశారు.<

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?