ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన జగన్!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రస్తుత మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి లను ఖరారు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆగష్టు 26న పోలింగ్.. అదే రోజు […]
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రస్తుత మంత్రి మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి లను ఖరారు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 3, తెలంగాణలో ఒక స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆగష్టు 26న పోలింగ్.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.