వాసిరెడ్డికి ‘వ్రతం’ దక్కింది.. ఇక ఈమె మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు వాసిరెడ్డి పద్మ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా వైసీపీ పార్టీ స్థాపించబడినప్పటి నుంచి ఆ పార్టీకి వెన్నంటే ఉండిన అతి కొద్ది మందిలో వాసిరెడ్డి పద్మ ఒకరు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిథిగా పనిచేసిన ఆమె టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడేవారు. ఇక […]
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ నియమితులయ్యారు. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు వాసిరెడ్డి పద్మ ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా వైసీపీ పార్టీ స్థాపించబడినప్పటి నుంచి ఆ పార్టీకి వెన్నంటే ఉండిన అతి కొద్ది మందిలో వాసిరెడ్డి పద్మ ఒకరు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిథిగా పనిచేసిన ఆమె టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడేవారు. ఇక ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో ఆమెకు కీలక పదవికి అప్పగించారు. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వ హయంలో ఈ పదవిలో పనిచేసిన నన్నపనేని రాజకుమారి ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే.