ఏపీ రాజధానిలో.. టీడీపీ జాతీయ కార్యాలయం..

ఏపీ రాజధానిలో.. టీడీపీ జాతీయ కార్యాలయం..

ఏపీ రాజధానిలో టీడీపీ జాతీయ కార్యాలయం శుక్రవారం ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో ఈ ఆఫీస్‌ను నిర్మించారు. ఈ నేపథ్యంలో గురువారం నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు కార్యాలయంలో పూజలు చేపట్టారు. శృంగేరీ శార‌దాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వ‌ర్యంలో తొలుత గ‌ణ‌ప‌తి పూజ.. అనంత‌రం సుద‌ర్శ‌న హోమం , గ‌ణ‌ప‌తి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం 10.03 నిమిషాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 06, 2019 | 12:42 AM

ఏపీ రాజధానిలో టీడీపీ జాతీయ కార్యాలయం శుక్రవారం ప్రారంభంకానుంది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో ఈ ఆఫీస్‌ను నిర్మించారు. ఈ నేపథ్యంలో గురువారం నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు కార్యాలయంలో పూజలు చేపట్టారు. శృంగేరీ శార‌దాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వ‌ర్యంలో తొలుత గ‌ణ‌ప‌తి పూజ.. అనంత‌రం సుద‌ర్శ‌న హోమం , గ‌ణ‌ప‌తి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం 10.03 నిమిషాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభంకానుంది. ఈ  ప్రారంభోత్సవానికి.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తలు హాజరుకానున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu