టీడీపీకి మరో షాక్..కీలక నేత రాజీనామా..!
2019 ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం టీడీపీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఆ పార్టీ నేతలు విడతల వారీగా వైసీపీ, బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఏకంగా సుజనా నేతృత్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీనే..బిజేపీలో విలీనమైంది. మరోవైపు రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలని సీఎం జగన్ నిబంధన విధించడంతో చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు ముందడుగు వెయ్యలేకపోతున్నారు. అయితే పలువురు మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పోరేషన్ ఛైర్మన్లు..జిల్లా పార్టీ అధ్యక్షులు టీడీపీలో.. తమ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం […]
2019 ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం టీడీపీని కష్టాలు వెంటాడుతున్నాయి. ఆ పార్టీ నేతలు విడతల వారీగా వైసీపీ, బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఏకంగా సుజనా నేతృత్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీనే..బిజేపీలో విలీనమైంది. మరోవైపు రాజీనామా చేసి తమ పార్టీలో చేరాలని సీఎం జగన్ నిబంధన విధించడంతో చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు ముందడుగు వెయ్యలేకపోతున్నారు. అయితే పలువురు మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పోరేషన్ ఛైర్మన్లు..జిల్లా పార్టీ అధ్యక్షులు టీడీపీలో.. తమ ప్రాథమిక సభ్యత్యానికి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.
తాజాగా టీడీపీ సీనియర్ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. రేపు ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు చంద్రబాబుకు లేఖ పంపించారు. కాగా ఇటీవల ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మస్తాన్ రావు ఓటమి చవిచూశారు. ఈయనకు నెల్లూరు జిల్లాల్లో మంచి క్యాడర్ ఉంది. ఎన్నో ఏళ్లుగా టీడీపీకి సేవ చేస్తూ వస్తోన్న బీద మస్తాన్ రావు పార్టీ మారడం పార్టీకి పెద్ద షాక్‌గానే రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.