కమలంలో కలహాలు.. కన్‌ఫ్యూజన్‌లో క్యాడర్..

కమలంలో కలహాలు.. కన్‌ఫ్యూజన్‌లో క్యాడర్..

నిజామాబాద్‌ లోటస్‌ పార్టీలో లొల్లి మొదలైంది. ఓ సీనియర్‌ లీడర్‌కీ, ఎంపీకి మధ్య కోల్డ్‌వార్‌ స్టార్ట్‌ అయింది. మున్సిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలో ఇది కొత్త తలనొప్పిగా మారుతోంది. కార్యకర్తలు తాము ఏవైపు నిలబడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. నిజామాబాద్‌లో బీజేపీ రెండు వర్గాలుగా మారిందట. ఇద్దరు నేతలు, రెండు వర్గాలు అన్నట్టుగా అక్కడ పార్టీ నడుస్తోందట. ఓవైపు సీనియర్‌ లీడర్‌ యెండల లక్ష్మీనారాయణ.. మరోవైపు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌. ఈ ఇద్దరు జిల్లా […]

Rajesh Sharma

|

Dec 06, 2019 | 6:47 PM

నిజామాబాద్‌ లోటస్‌ పార్టీలో లొల్లి మొదలైంది. ఓ సీనియర్‌ లీడర్‌కీ, ఎంపీకి మధ్య కోల్డ్‌వార్‌ స్టార్ట్‌ అయింది. మున్సిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలో ఇది కొత్త తలనొప్పిగా మారుతోంది. కార్యకర్తలు తాము ఏవైపు నిలబడాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.

నిజామాబాద్‌లో బీజేపీ రెండు వర్గాలుగా మారిందట. ఇద్దరు నేతలు, రెండు వర్గాలు అన్నట్టుగా అక్కడ పార్టీ నడుస్తోందట. ఓవైపు సీనియర్‌ లీడర్‌ యెండల లక్ష్మీనారాయణ.. మరోవైపు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌. ఈ ఇద్దరు జిల్లా బీజేపీలో ఆధిపత్యం నాదంటే నాదని కార్యకర్తల దగ్గర బల ప్రదర్శన చేస్తున్నారట. వీరి మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌ కార్యకర్తల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

అరవింద్ పార్టీలో కొందరికి మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారని జిల్లా బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు వస్తున్న తరుణంలో.. అటు అరవింద్, ఇటు యెండల ఎవరి ఆధిపత్యాన్ని వాళ్లు ప్రదర్శిస్తున్నారట. తమ అనుచరులకు టిక్కెట్ల విషయంలో అభయం ఇస్తున్నారట. ఒక టిక్కెట్‌ కోసం రెండువర్గాలు పోటీ పడుతున్న స్థానాలు కూడా ఉన్నాయట. ఇదంతా గమనిస్తున్న కార్యకర్తలు మాత్రం అయోమయానికి లోనవుతన్నారట. తాము ఎటువైపు ఉండాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.

పార్టీలో సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేదని ప్రచారం చేస్తున్నారట అరవింద్ వర్గీయులు. ఓడిపోయినవాళ్లు పార్టీ గురించి మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంట అరవింద్ చేస్తున్న కామెంట్లు యెండల వర్గానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయట. యెండల ఈ పంచాయితీని అధిష్టానం దగ్గరకు కూడా తీసుకెళ్లారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పుకుంటున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu