అనిల్‌చంద్ర పునేఠాకు పోస్టింగ్‌

అమరావతి: ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ తాజాగా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు అనిల్‌చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను ఏపీ సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల […]

అనిల్‌చంద్ర పునేఠాకు పోస్టింగ్‌
Follow us
Ram Naramaneni

|

Updated on: May 14, 2019 | 8:28 PM

అమరావతి: ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ తాజాగా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందు అనిల్‌చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను ఏపీ సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పునేఠాను ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలో నియమించాలని ఈసీఐ సూచించింది. అప్పట్నుంచి ఆయన వెయిటింగ్‌లోనే ఉన్నారు.