సీఎస్‌తో నో ప్రాబ్లమ్..ఈసీతోనే పరేషాన్: సోమిరెడ్డి

అమరావతి: ఫొని తుపాను వల్ల ఉద్యాన పంటలు నష్టపోయాయని.. బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించినట్టు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంతో గానీ, ఇంకెవరైనా అధికారులతో గానీ తమకెలాంటి సమస్యాలేదన్నారు. అధికారుల సహకారం, అంతా కలిసి సమష్టిగా పనిచేయడం వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని అన్నారు. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు కొత్త […]

సీఎస్‌తో నో ప్రాబ్లమ్..ఈసీతోనే పరేషాన్: సోమిరెడ్డి
Follow us
Ram Naramaneni

|

Updated on: May 14, 2019 | 7:09 PM

అమరావతి: ఫొని తుపాను వల్ల ఉద్యాన పంటలు నష్టపోయాయని.. బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించినట్టు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంతో గానీ, ఇంకెవరైనా అధికారులతో గానీ తమకెలాంటి సమస్యాలేదన్నారు. అధికారుల సహకారం, అంతా కలిసి సమష్టిగా పనిచేయడం వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామని అన్నారు. ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకొని ఇబ్బందులు పెట్టాలని చూశారన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు కొత్త విధాన నిర్ణయాలు మాత్రమే తీసుకోకూడదు తప్ప ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు స్పందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.