AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: తిరుపతి నుంచి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి!

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రదహదారి 40పై ఆళ్లగడ్డ సమీపంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను క్రాస్ చేసి మరో రూట్‌లో వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Road Accident: తిరుపతి నుంచి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి!
Nandyal Road Accident
Anand T
|

Updated on: Dec 26, 2025 | 8:46 AM

Share

శుక్రవారం తెల్లవారుజామున నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల- బత్తలూరు వద్ద ఓ కారు ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రాదంలో స్పాట్‌లోనే నలుగురు మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరు ఇటీవలే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తిరిగి హైదరాబాద్‌ వెళ్తుండగా..నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల- బత్తలూరు వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి..డివైడర్‌ను దాటుకొని అవతలవైపు రోడ్డులో వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. ఇక ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ బస్సు మాత్రం డ్యామేజ్ అయిందని పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్‌ నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా.. ఆ బస్సులోని ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపారు పోలీసులు.

ఇక ప్రమాదం జగరడంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిన కారును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఖర్జూరం.. బాదం.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
ఖర్జూరం.. బాదం.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన
పొలాల్లో దాక్కున్నా వదల్లేదు.. గ్రామస్తుల స్మార్ట్‌ ఆలోచన
వెన్నెల వెలుగుల్లో విహారం.. భారత్‌లో కొత్త ట్రెండ్ 'నైట్ టూరిజం'!
వెన్నెల వెలుగుల్లో విహారం.. భారత్‌లో కొత్త ట్రెండ్ 'నైట్ టూరిజం'!
డబుల్ మనీ అంటూ రూ.33 లక్షలు టోకరా.. పేపర్ బండిల్స్ ఇచ్చి..
డబుల్ మనీ అంటూ రూ.33 లక్షలు టోకరా.. పేపర్ బండిల్స్ ఇచ్చి..
అగన్వాడీ బాలామృతంతో బిస్కెట్స్.. సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలంటే
అగన్వాడీ బాలామృతంతో బిస్కెట్స్.. సింపుల్‌గా ఇంట్లోనే ఎలా చేయాలంటే
అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిని అడ్డుకోలేమా..
అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? దీనిని అడ్డుకోలేమా..
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..18 నెలల పాటు ఉచితంగా జెమిని AI ప్రో
జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..18 నెలల పాటు ఉచితంగా జెమిని AI ప్రో
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
ఇక్కడ చావు కూడా శాపమే.. చివరి మజిలీ కష్టాలు..
డొక్కా సీతమ్మ‌ జీవిత చరిత్ర‌పై విజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన..
డొక్కా సీతమ్మ‌ జీవిత చరిత్ర‌పై విజేంద్ర ప్రసాద్ కీలక ప్రకటన..
నడకదారిన వెళ్తున్న భక్తులకు తారసపడ్డ పెద్దపులి..
నడకదారిన వెళ్తున్న భక్తులకు తారసపడ్డ పెద్దపులి..