AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నదాత కన్నీరు ఆగే వరకు పోరాడతాను: పవన్

అన్నదాత కన్నీరు ఆగే వరకు పోరాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల సమస్యలపై ‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట పవన్, కాకినాడలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. రైతులు ఇచ్చిన నిమ్మరసంను స్వీకరించిన పవన్.. కొద్దిసేపటి క్రితం ఈ దీక్షను విరమించారు. ఈ సందర్భంగా దీక్షకు మద్ధతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు అని ఆయన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో […]

అన్నదాత కన్నీరు ఆగే వరకు పోరాడతాను: పవన్
TV9 Telugu Digital Desk
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Dec 12, 2019 | 8:40 PM

Share

అన్నదాత కన్నీరు ఆగే వరకు పోరాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల సమస్యలపై ‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట పవన్, కాకినాడలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. రైతులు ఇచ్చిన నిమ్మరసంను స్వీకరించిన పవన్.. కొద్దిసేపటి క్రితం ఈ దీక్షను విరమించారు. ఈ సందర్భంగా దీక్షకు మద్ధతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యావాదాలు అని ఆయన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని ఆయన ఫైర్ అయ్యారు. రైతులకు మాయమాటలు చెబుతున్నవారు బాగుంటున్నారని.. కానీ రైతులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు పట్టం కట్టేందుకే జనసేన ఉందని ఈ సందర్భంగా పవన్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ పదవుల కోసం పుట్టింది కాదని, ప్రజల సమస్యల కోసం పుట్టిందని ఆయన నొక్కి చెప్పారు. చిన్నతనంలో చాలా చిన్న మడిలో వ్యవసాయం చేశానని.. రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా వారి సమస్యల గురించి తెలుసని అన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం రైతుల భవిష్యత్తును కూల్చివేస్తోందని ఆయన మండిపడ్డారు. తినే గింజకు కులం లేనప్పుడు.. రైతుకెందుకని ఈ సందర్భంగా పవన్ విమర్శించారు. వైసీపీ నాయకులకు తమ కడుపు కోత కనబడటం లేదని ఆయన దుయ్యారబట్టారు. సీఎం తన ఇంటికి 9కోట్లు ఖర్చు చేశారని.. వాటికి రసీదులు ఇచ్చి, రైతులకు రసీదు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.

అందుకే వారి కష్టాలు తెలీదు: తనకు సినిమాలే తెలుసని.. కొందరిలా తాను సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టలేదని, కాంట్రాక్ట్‌లు చేయలేదని, సూట్‌కేసు కంపెనీలు పెట్టలేదని అందుకే వారి కష్టాలు తెలీవని అన్నారు. తన ఆత్మస్థైర్యం ఎప్పటికీ తగ్గదని ఈ సందర్భంగా పవన్ చెప్పారు.

రేపు మీ ప్రభుత్వం కూలిపోతుంది: వైసీపీ ప్రభుత్వం పరిపాలనను కూల్చివేతలతో ప్రారంభించిందని.. భవన నిర్మాణ కార్మికుల జీవితాలను కూల్చివేశారని, ఈ రోజు రైతుల భవిష్యత్‌ను కూల్చి వేస్తున్నారని పవన్ మండిపడ్డారు. అంతేకాకుండా తమ నేతలను భయపెడుతున్నారన్న పవన్.. ఆవేదన చెంది మాట్లాడితే వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారని.. రేపు మీ ప్రభుత్వం కూలిపోయి.. మీరు, మీ 150మంది ఎమ్మెల్యేలు కూడా కాలగర్భంలో కలిసిపోతారని ఆయన జోస్యం చెప్పారు.

అసెంబ్లీ తిట్లే ఎక్కువగా ఉన్నాయి: అధికార, విపక్షాలు అసెంబ్లీ సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అక్కడ తిట్లే ఎక్కువగా ఉన్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకే సంస్కారం ఉంటే.. 150మంది ఎమ్మెల్యేలకు సంస్కారం ఉండాలని.. అసెంబ్లీలో కనీసం బోటు ప్రమాదం మృతులకు సంతాపం కూడా తెలపలేదని పవన్ విమర్శించారు. అసెంబ్లీని హుందాగా నడపాలని ఈ సందర్భంగా సూచించారు.

ఇంగ్లీష్ మీడియంకు ఓకే: ఇక ఇంగ్లీష్ మీడియం పెట్టుకుంటే ఓకేనని ఈ సందర్భంగా పవన్ తన మద్ధతును ప్రకటించారు. అయితే తెలుగు గురించి కూడా ఆలోచించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇంగ్లీష్ బాగా రాకనే.. తాను ఇంటర్ ఫెయిల్ అయ్యాయని ఈ నేపథ్యంలో పవన్ వెల్లడించారు. కాగా ఈ దీక్షలో పవన్ కల్యాణ్‌తో పాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.