రాజ్‌భవన్‌కు బాబు.. గవర్నర్‌కు కీలక సమాచారం

ఏపీ అసెంబ్లీలో మొదలైన పాలక, ప్రతిపక్షాల పంచాయితీ గురువారం సాయంత్రం రాజ్‌భవన్ చేరింది. అసెంబ్లీలో అధికార పక్షం దారుణంగా వ్యవహరిస్తోందంటున్న విపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలతో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను అడ్డుకుంటున్నారని చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, చిక్కాల రామచంద్రరావు, అచ్చెన్నాయుడు తదితరులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్ళిన చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అయిదు […]

రాజ్‌భవన్‌కు బాబు.. గవర్నర్‌కు కీలక సమాచారం
Rajesh Sharma

|

Dec 12, 2019 | 7:03 PM

ఏపీ అసెంబ్లీలో మొదలైన పాలక, ప్రతిపక్షాల పంచాయితీ గురువారం సాయంత్రం రాజ్‌భవన్ చేరింది. అసెంబ్లీలో అధికార పక్షం దారుణంగా వ్యవహరిస్తోందంటున్న విపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలతో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాను అడ్డుకుంటున్నారని చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, చిక్కాల రామచంద్రరావు, అచ్చెన్నాయుడు తదితరులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్ళిన చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు అయిదు పేజీల లేఖను అందచేశారు.

టిడిపి ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రానీయకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. స్పీకర్ అనుమతి లేకుండానే అసెంబ్లీ ఆవరణలో వీడియోలు ప్లే చేస్తున్నారని ఆయనన్నారు. వందలాది మంది యువకులపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసులు పెట్టి జగన్ ప్రభుత్వం వేధిస్తోందని చంద్రబాబు అంటున్నారు. నాగరిక ప్రపంచంలో మనుషుల్లాగా వైసీపీ నేతలు ప్రవర్తించడం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

కొత్తగా వచ్చిన చీఫ్ మార్షల్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని, విపక్ష నేత అన్న గౌరవం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నాడని చంద్రబాబు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో తనకు అనుకూలమైన మీడియాను అనుమతించి, వ్యతిరేకంగా రాస్తున్నారన్న అభిప్రాయంతో కొన్ని మీడియా సంస్థల ప్రతినిధులు రాకుండా దుర్మార్గమైన చర్యలను ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. జివో నెంబర్ 2430 తీసుకురావడం ద్వారా కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశపూర్వకంగా వేధించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళారు. గవర్నర్ జోక్యానికి చంద్రబాబు విఙ్ఞప్తి చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu