రాజధాని కోసం రక్తం చిందిన రక్తం..ఎక్కడంటే..?

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న నిరసన దీక్షలు 20వ రోజుకు చేరకున్నాయి. నేడు మహా పాదయాత్రను చేపట్టారు రైతులు. వేల సంఖ్యలో తుళ్లూరు నుంచి మందడం వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనకు ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు చెప్తున్నారు. కాగా అమరావతి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లులో  కుటుంబ సభ్యులతో నిరాహారదీక్షను చేప్టటారు. రక్తాన్ని […]

రాజధాని కోసం రక్తం చిందిన రక్తం..ఎక్కడంటే..?
Follow us

|

Updated on: Jan 06, 2020 | 2:31 PM

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న నిరసన దీక్షలు 20వ రోజుకు చేరకున్నాయి. నేడు మహా పాదయాత్రను చేపట్టారు రైతులు. వేల సంఖ్యలో తుళ్లూరు నుంచి మందడం వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నారు. అయితే అమరావతి ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనకు ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు చెప్తున్నారు.

కాగా అమరావతి కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లులో  కుటుంబ సభ్యులతో నిరాహారదీక్షను చేప్టటారు. రక్తాన్ని చిందించి అయినా అమరావతిని కాపాడుకుంటాం అంటూ రక్తంతో ప్లకార్డులపై వేలి ముద్రలు వేశారు. మరోవైపు విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రాంమోహన్ సైతం  ‘సేవ్ ఏపీ..సేవ్ అమరావతి’ పేరుతో 24 గంటల రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఈ నిరసన కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు హాజరై, మద్దతు ప్రకటించారు.