బీజేపీలో చేరుతా.. కానీ ఒక కండిషన్: జేసీ

బీజేపీలో చేరికపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పష్టతను ఇచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దేశంలో కలిపితే బీజేపీలో తాను చేరతానని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో జేసీ భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ నేతలను కలవడంతో ప్రాధాన్యం లేదన్న ఆయన.. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మర్యాదపూర్వకంగానే సత్యకుమార్‌ను కలిశానని చెప్పుకొచ్చారు. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో జేసీ […]

బీజేపీలో చేరుతా.. కానీ ఒక కండిషన్: జేసీ
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2020 | 6:43 PM

బీజేపీలో చేరికపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి స్పష్టతను ఇచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను దేశంలో కలిపితే బీజేపీలో తాను చేరతానని ఆయన అన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో జేసీ భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ నేతలను కలవడంతో ప్రాధాన్యం లేదన్న ఆయన.. జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. మర్యాదపూర్వకంగానే సత్యకుమార్‌ను కలిశానని చెప్పుకొచ్చారు.

అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో జేసీ ఫ్యామిలీకి రాజకీయంగా గడ్డుకాలం నడుస్తోంది. దానికి తోడు  జేసీ ట్రావెల్స్‌‌కు చెందిన పలు బస్సులను సీజ్ చేయడంతో వ్యాపారపరంగా వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో జేసీ పార్టీ మారుతారంటూ ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇక పార్టీ మార్పుపై జేసీ తాజా వ్యాఖ్యలను చూస్తుంటే.. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతారన్న వార్తలకు బలం చేకూరిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.