AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ లీక్‌కు కారణాలు ఇవే.. సీఎంకు హైపవర్ కమిటీ నివేదిక

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌లీక్‌ ఘటనపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి...

గ్యాస్ లీక్‌కు కారణాలు ఇవే.. సీఎంకు హైపవర్ కమిటీ నివేదిక
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jul 06, 2020 | 1:58 PM

Share

High Power Committee Submit Report  : విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌లీక్‌ ఘటనపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఈ కమిటీ కలిసింది. గ్యాస్ లీకేజీపై ఈ కమిటీ చేసిన విచారణలో తేలిన వివరాలను సీఎంకు వివరించింది. గ్యాస్ లీకేజీ జరిగిన సమయంలో ఏం జరిగింది…?ఎవరి నిర్లక్ష్యం ఎంత ఉంది…? ప్రభుత్వ రూల్స్ ను కంపెనీ అతిక్రమించిందా..? రాబోయే రోజుల్లో గ్యాస్ లీకేజీ ప్రభావం ఉండనుందా…? ఇలా చాలా విషయాలను తమ నివేదికలో పొందుపరిచారు కమిటీ సభ్యులు.

ఐదు గ్రామాల బాధిత ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, సీనియర్ జర్నలిస్ట్‌లతో హైపవర్‌ కమిటీ చర్చించింది. ప్రమాదం జరిగిన తీరు, భవిష్యత్‌లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను ఈ కమిటీ రూపొందించింది. ఆ నివేదికను సీఎంకు అందజేసింది.

అటవీ పర్యావరణం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌, విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, కలెక్టర్ ఈ హైపవర్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. మే 7న ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆరు ప్రత్యేక కమిటీలతో పాటు హైపవర్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది.