ప్రజావేదిక రోడ్డు వివాదం.. రైతుల ఆందోళన

ప్రజావేదిక కూల్చివేత దాదాపుగా పూర్తి కావస్తుండగా.. మరో వివాదం వెలుగులోకి వచ్చింది.ప్రజావేదిక వద్దకు వెళ్లే రోడ్డు తమ భూముల్లో వేశారంటూ ఆరోపిస్తోన్న రైతులు అక్కడ ఆందోళనకు దిగారు. ఆ రోడ్డును తొలగించి తమ భూములు తమకు అప్పగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ప్రకాశ్, సాంబశివరావు అనే రైతులు గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పంద పత్రాలు తీసుకొచ్చారు. అయితే ప్రజావేదిక రోడ్డు తొలగిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాకపోకలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. […]

ప్రజావేదిక రోడ్డు వివాదం.. రైతుల ఆందోళన
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 26, 2019 | 12:09 PM

ప్రజావేదిక కూల్చివేత దాదాపుగా పూర్తి కావస్తుండగా.. మరో వివాదం వెలుగులోకి వచ్చింది.ప్రజావేదిక వద్దకు వెళ్లే రోడ్డు తమ భూముల్లో వేశారంటూ ఆరోపిస్తోన్న రైతులు అక్కడ ఆందోళనకు దిగారు. ఆ రోడ్డును తొలగించి తమ భూములు తమకు అప్పగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు ప్రకాశ్, సాంబశివరావు అనే రైతులు గత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పంద పత్రాలు తీసుకొచ్చారు.

అయితే ప్రజావేదిక రోడ్డు తొలగిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాకపోకలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు సైతం ఇదే రోడ్డు నుంచి తన నివాసానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రోడ్డుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే చంద్రబాబు నాయుడు నివాసం కూడా అక్రమంగా నిర్మించిందేనని.. దానిని కూడా కూలగొట్టాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే.