ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం…అక్రమ మద్యంపై ఉక్కుపాదం

రాష్ట్రంలో దశల వారీ మద్య నియంత్రణ, మద్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల్ని తగ్గించిన సర్కార్ ఆ తర్వాత ధరల్ని భారీగా పెంచేసింది. ఇప్పుడు..

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం...అక్రమ మద్యంపై ఉక్కుపాదం
Follow us

|

Updated on: Jul 09, 2020 | 1:46 PM

రాష్ట్రంలో దశల వారీ మద్య నియంత్రణ, మద్యం అక్రమ రవాణాపై ఏపీ సర్కార్ మరింత కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల్ని తగ్గించిన సర్కార్ ఆ తర్వాత ధరల్ని భారీగా పెంచేసింది. ఇప్పుడు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కలిసి అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపనున్నారు. అందులో భాగంగానే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోకు చట్టబద్ధత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మద్యం అక్రమ రవాణాపై సీరియస్‌గా ఫోకస్ చేసిన ఏపీ ప్రభుత్వం..ఆంధ్ర సరిహద్దుల్లో నిఘాను మరింతగా పెంచనుంది. ఎవరైనా అక్రమంగా మద్యం తీసుకొచ్చినా, మద్యాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకోసం చట్టాలను మరింత కఠినతరం చేసింది. మద్యం అక్రమ రవాణాకు పాల్పడిన వారి పట్ల కఠిన చట్టాలు అమల్లోకి వచ్చేలా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ బెయిలబుల్ కేసులతో పాటు, పలుమార్లు అలా పట్టుబడిన వారిపై ఎనిమిదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టాలను సవరించింది.