నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని భేటీ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని భేటీ అయ్యారు. లోకల్‌ బాడీ ఎలక్షన్‌ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని

  • Tv9 Telugu
  • Publish Date - 4:45 pm, Wed, 28 October 20
నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని భేటీ

Nilam Sawhney Nimmagadda Ramesh Kumar: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని భేటీ అయ్యారు. లోకల్‌ బాడీ ఎలక్షన్‌ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని రమేష్ కుమార్ కోరిన నేపథ్యంలో సాహ్ని ఆయనను కలిశారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ సన్నద్ధత తదితర అంశాలపై వీరు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.(ఎలక్ట్రిక్‌ సైకిల్‌ వీడియో విడుదల చేసిన హార్లే-డేవిడ్సన్‌)

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం కోసం ఈ ఉదయం వివిధ రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి అధికార వైసీపీ సహా 7 పార్టీలు ఈ భేటీకి గైర్హాజరయ్యాయి.(స్టాఫ్‌కి కారును గిఫ్ట్‌గా ఇచ్చిన జాక్వలిన్‌)