వలస కార్మికులపై ఏపీ సీఎస్ గొప్ప మనసు.. సాహో ‘సాహ్ని’..!

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని తన గొప్ప మనసును చాటుకున్నారు. లాక్‌డౌన్ వేళ తమ గ్రామాలకు నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికుల వివరాలు తెలుసుకున్న

వలస కార్మికులపై ఏపీ సీఎస్ గొప్ప మనసు.. సాహో 'సాహ్ని'..!
Follow us

| Edited By:

Updated on: May 16, 2020 | 3:03 PM

ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని తన గొప్ప మనసును చాటుకున్నారు. లాక్‌డౌన్ వేళ తమ గ్రామాలకు నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికుల వివరాలు తెలుసుకున్న ఆమె వారికి సహాయం చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సీఎం వైఎస్‌ జగన్‌తో మీటింగ్ తరువాత ఇంటికి వెళ్లే క్రమంలో నీలం సాహ్నికి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వలస కార్మికులు కనిపించారు. వెంటనే తన కారు నుంచి దిగి వారి వద్దకు వెళ్లిన సాహ్ని.. తానెవరో చెప్పకుండా కార్మికుల వివరాలను అడిగారు. ఈ సందర్భంగా తాము బీహార్‌కు వెళ్లాలని.. లాక్‌డౌన్‌ వలన తమ దగ్గరున్న డబ్బులు మొత్తం అయిపోవడంతో ఏమీ చేయాలో తెలీక కాలినడకన వెళుతున్నట్లు చెప్పారు. దీంతో వెంటనే గుంటూరు జాయింట్ కలెక్టర్, కృష్ణా కలెక్టర్‌కు ఫోన్ చేసిన సాహ్ని.. వలస కార్మికులకు తాత్కాలిక నివాస సదుపాయం కల్పించాలని ఆదేశించారు. అంతేకాదు వారికి ఆహారం, నీళ్లు అందించాలని.. ఏ ఒక్కరు ఆకలితో బాధపడకూడదని పేర్కొన్నారు. ఇక వలస కార్మికులను వారి వారి స్వరాష్ట్రాలకు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని కింది స్థాయి అధికారులకు సాహ్ని తెలిపారు. ఈ సందర్భంగా వలస కార్మికులు నీలం సాహ్నికి కృతఙ్ఞతలు చెప్పారు.

Read This Story Also: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌ డేట్‌పై నిర్మాత క్లారిటీ.. దానయ్య మాటేంటంటే..!