AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వలస కూలీలపై విరిగిన లాఠీ.. తాడేపల్లిలో దారుణం

దిక్కుతోచక సొంతూళ్ళకు బయలుదేరిన వలస కూలీలపై పోలీసులు కాఠిన్యం ప్రదర్శించారు. లాఠీలకు పని చెప్పి మరీ వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఆడ, మగా అన్న తేడా లేకుండా ...

వలస కూలీలపై విరిగిన లాఠీ.. తాడేపల్లిలో దారుణం
Rajesh Sharma
|

Updated on: May 16, 2020 | 1:33 PM

Share

Thadepally police latee charge on migrated workers:  దిక్కుతోచక సొంతూళ్ళకు బయలుదేరిన వలస కూలీలపై పోలీసులు కాఠిన్యం ప్రదర్శించారు. లాఠీలకు పని చెప్పి మరీ వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఆడ, మగా అన్న తేడా లేకుండా లాఠీలతో చితకబాదడంతో వలస కూలీలు గాయాలపాలయ్యారు. వీరిలో పలువురు మహిళలు కూడా వున్నారు. వలసకూలీలపై తాడేపల్లి పోలీసులు లాఠీఛార్జి చేశారు. సుమారు 150 మంది కూలీలు కృష్ణా వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. భయంతో పరుగులు పెట్టిన కూలీలపై లాఠీఛార్జి చేశారు. పోలీసుల దురుసుతనంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

మే 15వ తేదీన సాయంత్రం రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను అటుగా వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గమనించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రహదారిపై వెళ్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వెయ్యి మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు. వీరిలో కొంతమంది కాలినడకన వెళ్లేవారు, మరికొందరు సైకిళ్లపై వెళ్లేవారు ఉన్నారు.

శనివారం ఉదయం పునరావాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో సైకిళ్లపై వచ్చిన కూలీలు కొందరు తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. అనంతరం వారందరినీ విజయవాడ క్లబ్‌కు తీసుకొచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. తమను కలిసిన వారి తమకు అయిన గాయాలను చూపించి వాపోయారు వలస కూలీలు. పోలీసుల దురుసుతనంపై పలువురు విమర్శలు చేస్తుండగా.. లాక్ డౌన్ అమలులో ఆ మాత్రం దూకుడు తప్పదని పోలీసులు సమర్థించుకుంటున్నారు.

Read this: పోతిరెడ్డిపాడుపై త్వరలో అపెక్స్ భేటీ.. బండికి షెకావత్ లేఖ

Read this: కరోనా కంటే కరెంటు షాకే డేంజర్… జగన్ సర్కార్‌పై జనసేన విమర్శ