కరోనా కోసం వాంఖేడ్ స్టేడియం
కరోనా దెబ్బకి కాదేదీ క్వారెంటైన్ సెంటర్ అన్నట్లుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలమైన అన్నీ అవకాశాలను వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగానూ కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కోవిడ్ 19 బాధితులతో ముంబై ఆస్పత్రులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. దీంతో బృహన్ ముంబై […]

కరోనా దెబ్బకి కాదేదీ క్వారెంటైన్ సెంటర్ అన్నట్లుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలమైన అన్నీ అవకాశాలను వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగానూ కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చుతోంది. దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కోవిడ్ 19 బాధితులతో ముంబై ఆస్పత్రులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబైలోని చారిత్రాత్మక వాంఖేడ్ స్టేడియాన్ని క్వారెంటైన్ కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. వీలైనంత తొందరగా మైదానాన్ని తమకు అప్పగించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. ఈ మేరకు ముంబై క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ)కు ఓ లేఖ రాశారు.
మహారాష్ట్రంలో ఇప్పటి వరకే 29,100 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… వైరస్ సోకి 1,068 మంది మృత్యువాత పడ్డారు. అత్యధిక కేసులు ముంబైలోనే నమోదవుతున్నాయి. దీంతో ముంబై కార్పోరేషన్ తమ పరిధిలోని ఆస్పత్రులతో పాటు హోటల్స్, లాడ్జ్, క్లబ్స్, కాలేజీలు, పంక్షన్ హాల్స్ తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. వీటిలో కరోనా బాధితులకు వైద్యం అందించడంతో పాటు వారికి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వసతి కల్పించాలని బీఎంసీ భావిస్తోంది.




