AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌ డేట్‌పై నిర్మాత క్లారిటీ.. దానయ్య మాటేంటంటే..!

లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమాల షూటింగ్‌కు బ్రేక్‌ పడగా.. ఆర్ఆర్ఆర్ రిలీజ్‌ డేట్‌పై నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఆయన తేల్చేశారు.

'ఆర్ఆర్ఆర్' రిలీజ్‌ డేట్‌పై నిర్మాత క్లారిటీ.. దానయ్య మాటేంటంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 16, 2020 | 2:35 PM

Share

లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమాల షూటింగ్‌కు బ్రేక్‌ పడగా.. ఆర్ఆర్ఆర్ రిలీజ్‌ డేట్‌పై నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ఆయన తేల్చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ 70 శాతం పూర్తి అయ్యిందని.. ఇంకో 30శాతం మాత్రమే మిగిలి ఉందని దానయ్య చెప్పారు.

అయితే గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమా విడుదలలో మార్పులు జరగాల్సిందేనని ఈ నిర్మాత వివరించారు. ఇక ప్రభుత్వం అనుమతులు ఇస్తే.. పరిమిత బృందంతో సెట్‌లో షూటింగ్ జరుపుతామని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దానయ్య తెలిపారు. అయితే ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్యన రాజమౌళి కూడా తెలిపారు. షూటింగ్‌ మళ్లీ ప్రారంభం అయితే గానీ.. ఈ సినిమాకు రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేయలేమంటూ జక్కన్న పేర్కొన్నారు.

కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. వీరి సరసన అలియా, ఒలివియా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, రాహుల్ రామకృష్ణతో పాటు పలువురు విదేశీ నటులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొదట ఈ మూవీని ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ షూటింగ్‌లో జాప్యం వలన వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది.

Read This Story Also: ఏపీలో కరోనా నుంచి కోలుకున్న ‘ఆ’ జిల్లా..

Follow Us
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ ఆరోగ్య రహస్యం తెలిసినా పాటించరు..
మార్నింగ్ గ్లాస్ మంత్రం.. ఈ ఆరోగ్య రహస్యం తెలిసినా పాటించరు..
మాకు దొరికేశాడు ఓ ఆణిముత్యం.. రోహిత్ ఇక నువ్వు లగేజీ సర్దేయ్..!
మాకు దొరికేశాడు ఓ ఆణిముత్యం.. రోహిత్ ఇక నువ్వు లగేజీ సర్దేయ్..!
NTR పేరు బద్నాం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.. : NTR ఫ్యాన్ కన్వీ
NTR పేరు బద్నాం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు.. : NTR ఫ్యాన్ కన్వీ
గురు గ్రహోదయం తర్వాత కూడా పెళ్లిళ్లు ఎందుకు జరగవు? వివాహ..
గురు గ్రహోదయం తర్వాత కూడా పెళ్లిళ్లు ఎందుకు జరగవు? వివాహ..