Andhra Pradesh: ఆ ఖాకీలకు సలాం..! అడవి బిడ్డలకు వస్త్రాలు, రైటింగ్ మెటీరియల్ పంపిణీ

వాళ్లంతా ఖాకిలు.. ఎప్పుడూ విధి నిర్వహణలో బిజీబిజీగా ఉంటారు. వాళ్లు యూనిఫాంలో ఉంటే ఇప్పటికీ చాలామందిలో ఒక తెలియని భయం. చిన్న పిల్లలైతే పోలీసులను చూసి పారిపోతూ ఉంటారు. ఎందుకంటే.. వాళ్ల విధి నిర్వహణ అటువంటిది. శాంతి భద్రతలకు కాపాడడం.. తేడాగాళ్ళ తాటతీయడం వారి నైజం..! ఇక ఏజెన్సీలో అయితే.. పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇదంతా ఒకవైపు .. కానీ ఇప్పుడు ఆ పోలీసులే పిల్లల మనసు గెలుచుకున్నారు..

Andhra Pradesh: ఆ ఖాకీలకు సలాం..! అడవి బిడ్డలకు వస్త్రాలు, రైటింగ్ మెటీరియల్ పంపిణీ
Alluri District Police
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Srilakshmi C

Updated on: Jan 09, 2024 | 3:44 PM

జి మడుగుల, జనవరి 9: వాళ్లంతా ఖాకిలు.. ఎప్పుడూ విధి నిర్వహణలో బిజీబిజీగా ఉంటారు. వాళ్లు యూనిఫాంలో ఉంటే ఇప్పటికీ చాలామందిలో ఒక తెలియని భయం. చిన్న పిల్లలైతే పోలీసులను చూసి పారిపోతూ ఉంటారు. ఎందుకంటే.. వాళ్ల విధి నిర్వహణ అటువంటిది. శాంతి భద్రతలకు కాపాడడం.. తేడాగాళ్ళ తాటతీయడం వారి నైజం..! ఇక ఏజెన్సీలో అయితే.. పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇదంతా ఒకవైపు .. కానీ ఇప్పుడు ఆ పోలీసులే పిల్లల మనసు గెలుచుకున్నారు. తల్లిదండ్రులను వదిలి మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి విద్యను అభ్యసిస్తున్న ఆ గిరిజన విద్యార్థులకు అన్ని తామయ్యారు. పండుగకు ముందే.. సంక్రాంతి సంబరాల ఆనందాన్నిచ్చారు. స్వయంగా చేతులతో వారికి వడ్డించి, కడుపునిండా భోజనం పెట్టారు.

అల్లూరి జిల్లా పోలీసులు ఔదార్యం చూపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గిరిజన విద్యార్థులకు చేయూతని అందించారు జి మాడుగుల పోలీసులు. విద్యార్థులకు వస్త్రాలను పంపిణీ చేసిన పోలీసులు.. పదో తరగతి విద్యార్థులకు రైటింగ్ మెటీరియల్ అందించారు. అంతే కాదు.. విద్యార్థులకు భోజనం పెట్టి.. వాళ్లతో పోలీసులు కలిసి భోజనం చేశారు. ఏఎస్పీ ధీరజ్ స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించారు. జి మాడుగుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల.. విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. వాళ్లతో కలిసి ఆడిపడారు. కష్టం వచ్చినప్పుడు మేమున్నాం అనే భరోసాను కల్పించారు పోలీసులు.

కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిమాడుగుల పోలీసులు… చేసిన కార్యక్రమానికి సిఆర్పిఎఫ్ జవాన్లు జత కలిశారు. జి మడుగుల ఏకలవ్య స్కూల్, బంధవీధి పాఠశాలతో పాటు, మినీ గురుకులం, కోరాపల్లి స్కూల్, కేజీబీవీ ప్రభుత్వ స్కూల్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏఎస్‌పి ధీరజ్‌తోపాటు.. జి మాడుగుల సిఐ రమేష్, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పిల్లలతోపాటు సందడిగా సంబరాల్లో మునిగితేలారు. ఇక.. ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించి సంక్రాంతి సెలవులకు విద్యార్థుల గ్రామాలకు తీసుకెళ్లి వారిని ఇంటి వద్ద విడిచిపెట్టారు. ఎటువంటి కష్టం వచ్చినా మేమున్నామని భరోసా కల్పించారు పోలీసులు. పోలీసుల ఔదార్యానికి గిరిజన విద్యార్థులు సలాం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.