Srisailam Dam: శ్రీశైలం డ్యాం మరమ్మత్తులపై ప్రభుత్వం దృష్టి.. ప్రాజెక్ట్‌ను పరిశీలించిన వరల్డ్ బ్యాంకు బృందం
సున్నిపెంట ఏపీ జెన్కో గెస్ట్ హౌస్ కి చేరుకున్న ప్రతినిధుల బృందం ఈ రోజు శ్రీశైలం డ్యామ్ వద్దకు జలాశయనికి సంబంధిత అధికారులతో డ్యామ్ చేరుకున్నారు. ముందుగా జలాశయం గేట్లు, గ్యాలరీ, డ్యామ్ ముందు భాగంగాలో ఏర్పడిన ప్లంజ్ పూల్ ను పరిశీలించారు. శ్రీశైలం జలాశయం మరమ్మత్తులతో పాటు డ్యామ్ ముందు భాగంలోని దెబ్బతిన్న కొండ ప్రాంతానికి సంబంధించిన పనులకు సందర్శించారు. అయితే జలాశయం మరమ్మతులకు 700 నుండి 800 కోట్లు అవుతుందని అంచనా వేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం డ్రిప్ ప్రాజెక్టు నిధుల వినియోగానికి సంబంధించిన పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి హాండా నేత్రత్వంలో 10 మంది బృందంతో పరిశీలించారు . సోమవారం రాత్రి సున్నిపెంట ఏపీ జెన్కో గెస్ట్ హౌస్ కి చేరుకున్న ప్రతినిధుల బృందం ఈ రోజు శ్రీశైలం డ్యామ్ వద్దకు జలాశయనికి సంబంధిత అధికారులతో డ్యామ్ చేరుకున్నారు. ముందుగా జలాశయం గేట్లు, గ్యాలరీ, డ్యామ్ ముందు భాగంగాలో ఏర్పడిన ప్లంజ్ పూల్ ను పరిశీలించారు. శ్రీశైలం జలాశయం మరమ్మత్తులతో పాటు డ్యామ్ ముందు భాగంలోని దెబ్బతిన్న కొండ ప్రాంతానికి సంబంధించిన పనులకు సందర్శించారు.
అయితే జలాశయం మరమ్మతులకు 700 నుండి 800 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా జలాశయం అధికారులు సుమారు 139 కోట్ల రూపాయలను విడుదల కోసం అంచనా వేసి ప్రతినిధుల బృందానికి పంపించారు. దీనితో ప్రతినిధుల బృందం ప్రపంచ బ్యాంకు బృందం.. హాండా ఆధ్వర్యంలో స్వయంగా పరిశీలించింది. ఈ ప్రతి నిధుల బృందం ప్రాజెక్ట్ ను పరిశీలించి రిపెర్స్ కోసం జలాశయ అధికారులు పంపించిన అంచనాలతో సరిపోతుందని సంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ అధికారులు పంపించిన అంచనాల పట్ల సంతృప్తినిచ్చిందని ప్రపంచ బ్యాంక్ బృందం సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇంకా ఏమైనా చిన్న చిన్న మరమ్మతులకు సంబంధించినవి కూడా పంపిస్తే పరిశీలించి నిధుల విడుదలకు అనుమతిస్తామన్నారు. పరిశీలన అనంతరం శ్రీశైలం డ్యాం డ్రిప్ ప్రాజెక్టు నిధుల వినియోగంపై యూ పాయింట్ వద్ద సంబంధిత అధికారులతో ప్రపంచ బ్యాంక్ బృందం సమీక్ష సమావేశం నిర్వహించారు.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..