శ్రీశైలంలో అక్క మహాదేవికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారు? కన్నడ భక్తులు ఎందుకు విశేషంగా కొలుస్తారు?
శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రముఖ శివశరణి అక్కమహాదేవి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దేవస్థానం సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించింది. అర్చకులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు అక్కమహాదేవి విగ్రహానికి పంచామృత, జలాభిషేకాలు చేశారు. 12వ శతాబ్దపు కన్నడ శివశరణి అయిన అక్కమహాదేవిని కర్ణాటక భక్తులు ఎక్కువగా ఆరాధిస్తారు.

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంతోత్సవం దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. జయంతోత్సవం సందర్భంగా అర్చకులు ఆలయ ఈవో శ్రీనివాస రావు దంపతులు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి విగ్రహానికి పంచామృత, జలాభిషేకలు నిర్వహించారు. ముందుగా జయంతోత్సవ సంకల్పాన్ని పఠించి, మహాగణపతి పూజ, మల్లికా గుండంలోని శుద్ధ జలాలతో, జలాభిషేకం, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
విశేష పూజలు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు. 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివశరణిగా ప్రసిద్ధి పొందిన అక్కమహాదేవి శ్రీమల్లికార్జునుడిపై సంస్కృత, కన్నడ భాషలలో ఎన్నో వచనాలు చెప్పింది. అందుకే కర్ణాటక భక్తులు ఎక్కువగా ఆరాధిస్తారు. దీనితో శ్రీశైలం దేవస్థానం ప్రతి సంవత్సరం అక్కమహాదేవి జయంతోత్సవం విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.