Chandrababu – Pawan Kalyan: పదేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, పవన్.. ఫుల్ ఖుషీలో జనసేన, టీడీపీ వర్గాలు
2014 ఎన్నికల్లో... తొలిసారి పబ్లిక్‌మీటింగ్‌లో ఒకే వేదికపై కనిపించిన పవన్ కల్యాణ్, చంద్రబాబు... ఆ తర్వాత ఏ బహిరంగసభలోనూ కలిసి పాల్గొనలేదు. అప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నాయ్. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల సభలో.. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి వేదిక పంచుకున్నారు పవన్, చంద్రబాబు. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారం చేపట్టగా... జనసేన మిత్రపక్షంగా కొనసాగింది.

సరిగ్గా పదేళ్లు.. పదంటే పదేళ్లు.. ఏపీ రాజకీయ ముఖచిత్రంపై సేమ్ సీన్ రిపీట్ కాబోతోంది. ఇద్దరు కీలకనేతలు మరోసారి చేతులు కలిపి.. ఒకే వేదికపై కనిపించబోతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్… ఈ ఇద్దరు నాయకుల తాజా భేటీ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రత్యర్థుల మాటలు, విమర్శలు ఎలా ఉన్నా.. దీన్ని, తెలుగుదేశం-జనసేన వర్గాలు మాత్రం.. పొలిటికల్‌గా మోస్ట్ అవెయిటెడ్ ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాయి. ఇక అధికారపక్షానికి చుక్కలే అంటున్నారు ఆ పార్టీల నాయకులు.
2014 ఎన్నికల్లో… తొలిసారి పబ్లిక్‌మీటింగ్‌లో ఒకే వేదికపై కనిపించిన పవన్ కల్యాణ్, చంద్రబాబు… ఆ తర్వాత ఏ బహిరంగసభలోనూ కలిసి పాల్గొనలేదు. అప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో ఉన్నాయ్. తిరుపతిలో నిర్వహించిన ఎన్నికల సభలో.. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి వేదిక పంచుకున్నారు పవన్, చంద్రబాబు. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారం చేపట్టగా… జనసేన మిత్రపక్షంగా కొనసాగింది. కానీ ఎక్కడా కూడా ఆ రెండు పార్టీలు సంయుక్తంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయలేదు. అయితే, ప్రత్యేక హోదా విషయంలో పొరపచ్చాలు రావడంతో.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన జనసేన… 2019 ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేనలకు ఫలితాలు ఆశాజనకంగా రాలేదు.
2019 తర్వాత మరోసారి.. చంద్రబాబు, పవన్‌ల కలయికపై చర్చ మొదలైంది. మళ్లీ జనసేన, టీడీపీ కలవబోతున్నాయనే ముచ్చట రాజకీయ వర్గాల్లో కొత్త ఆసక్తిని రేపింది. గత మూడున్నరేళ్లుగా దీనిపై డిస్కషన్ జరుగుతూనే ఉంది. పలుసార్లు చంద్రబాబు, పవన్ భేటీ జరిగినా… రెండు పార్టీల పొత్తు విషయంలో పురోగతి రాలేదు. కానీ, తాజాగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు… టీడీపీ, జనసేన పొత్తులపై స్పష్టత ఇచ్చేశారు. దీంతో రెండు పార్టీల నాయకులు.. ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాబోయేది జనసేన-టీడీపీ ప్రభుత్వమేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఇప్పుడు మరోసారి ఒకే బహిరంగవేదికపైకి వచ్చేస్తున్నారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. విశాఖలో ఇవాళ జరగబోయే బహిరంగసభలో ఈ ఇద్దరు నేతలు పాల్గొనబోతున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓకే వేదికపై కనించబోతుండటం.. రాజకీయంగా ఆసక్తిరేపుతోంది. ఎలాంటి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారనే ఉత్కంఠ రేపుతోంది.
2014లో ఈ ఇద్దరు నేతలు కలిశారు.. టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత.. సేమ్ సీన్ రిపీటవుతోంది. బహిరంగసభ వేదికను పంచుకోబోతున్నారు చంద్రబాబు, పవన్. మరి ఎన్నికల ఫలితాలు సేమ్ టు సేమ్ రిపీటవుతాయా? అనే ఆశతో ఎదురుచూస్తున్నాయి రెండు పార్టీలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..