Old Women: బస్సులో ప్రయాణిస్తున్న వృద్ద మహిళ అరెస్ట్.. పోలీసుల విచారణలో నివ్వరపోయే నిజాలు..
ఏంటి వినడానికి విచిత్రంగా ఉందా 65ఏళ్ల వయస్సులో ఒక వృద్ధ మహిళా పోలీసులకు సవాల్ విసరడం ఎంటి అనుకుంటున్నారా. అవును నిజమే ప్రయాణికురాలిగా నటిస్తూ బస్సుల్లో తిరిగే ఈ వృద్ధురాలిపేరు ముత్యాలమ్మ. వయసు 65 సంవత్సరాలు. సేదతీరాల్సిన వయస్సులో దొంగతనాలు చేస్తూ అటు ఆర్టీసి అధికారులకు ఇటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు.

ఏంటి వినడానికి విచిత్రంగా ఉందా 65ఏళ్ల వయస్సులో ఒక వృద్ధ మహిళా పోలీసులకు సవాల్ విసరడం ఎంటి అనుకుంటున్నారా. అవును నిజమే ప్రయాణికురాలిగా నటిస్తూ బస్సుల్లో తిరిగే ఈ వృద్ధురాలిపేరు ముత్యాలమ్మ. వయసు 65 సంవత్సరాలు. సేదతీరాల్సిన వయస్సులో దొంగతనాలు చేస్తూ అటు ఆర్టీసి అధికారులకు ఇటు పోలీసులకు ముచ్చెమటలు పట్టించారు. వరుస దొంగతనాలు చేస్తూ అటు ప్రయాణికులకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేశారు.
బస్సులో ప్రయాణికురాలిగా ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులు ఆదమరచి నిద్రపోతున్న వేళ వారి దృష్టి మరిల్చి నగలు డబ్బుతో ఉడాయిస్తున్నారు ముత్యాలమ్మ. దీంతో బంగారం పోయిందన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బస్సులో ప్రయాణించి తమ వస్తువులను పోగొట్టుకున్న బాధితుల సంఖ్య పోలీసు స్టేషన్ కు క్యూ కట్టారు. దీంతో నిఘా పెంచిన పోలీసులు ముత్యాలమ్మను అరెస్ట్ చేశారు. ఆమెను విచారణ చేయగా.. మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
భీమవరంకు చెందిన ముత్యాలమ్మ బస్సుల్లో ప్రయాణికుల బంగారమే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల వరుసగా బస్సులో దొంగతనాలు జరుగుతుండటంతో నిఘా పెట్టిన పోలీసులు ముత్యాలమ్మను అరెస్ట్ చేశారు. ఆమెపై పెట్టిన కేసులను చూస్తే నివ్వెర పోవాల్సిందే. ముత్యాలమ్మ ఒక్క విజయవాడలోనే కాకుండా 6 జిల్లాల పరిధిలో వందల కొద్ది దొంగతనాలు చేసిందనీ మొత్తం 50కి పైగా కేసులు ఉన్నాయని విచారణలో తేలింది. దీంతో ఆమెను చూసి పోలీసులే అవాక్కయ్యారు.
దొంగతనాలు చేసే ముత్యాలమ్మ వృద్ధురాలు కావడం పైగా అమాయకంగా ఉండటంతో దొంగతనం జరిగినా.. దొంగ పక్కనే ఉన్నా.. ప్రయాణికులు ఎవ్వరూ గుర్తించలేరన్న ధీమాతో దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నారు. ఇప్పటి వరకు అనేక దొంగతనాలకు పాల్పడి పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్న ముత్యాలమ్మను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక చోరీ కేసులో అనుమానితురాలిగా అదుపులోకి తీసుకోవడంతో మొత్తం దొంగతనాల వ్యవహారం బయటపడింది.
ముత్యాలమ్మ దొంగతనాల వ్యవహారం వెలుగులోకి రావడంతో మరింత లోతుగా విచారణ చేస్తున్నారు బెజవాడ పోలీసులు. ఇప్పటి వరకు 50కి పైగా కేసులు ఉన్నాయని గుర్తించగా ప్రస్తుతం ఆయా స్టేషన్ల నుంచి ముత్యాలమ్మ గురించి, గతంలో నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్నారు. భీమవరంకు చెందిన ముత్యాలమ్మ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూపి లాగే పనిలో ఉన్నారు పోలీసులు. అస్సలు వృద్ధురాలుగా ఉన్న ముత్యాలమ్మ చేసిన దొంగతనాల సొత్తు ఎవరికి ఇచ్చింది. సొత్తు అంతా ఎక్కడికి పోతుంది అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..