Andhra Pradesh: భర్త అంటే ఇంత ప్రేమా.. అనారోగ్యంతో భర్త మృతి.. నీ వెంటే నేనంటూ భార్య మరణం
కొందరు జీవిత భాగస్వామి మరణాన్ని తట్టుకోలేక అవతలివారిని అనుసరిస్తూ.. కానరాని లోకాలను వెళ్ళిపోతారు. తాజాగా ఇటువంటి విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
Andhra Pradesh: మూడు ముళ్లు, ఏడు అడుగులు.. అగ్ని సాక్షిగా ఒక్కటయ్యే దంపతులు.. ఒకరికొకరు తోడునీడగా నిండు నూరేళ్లు జీవిస్తామని ప్రమాణం చేస్తారు. పెళ్లి అయినది మొదలు కష్టసుఖాల్లో తోడునీడగా జీవిస్తారు.. అయితే భర్త భర్తల్లో ఎవరు ముందు పోయినా ఇంకొకరు.. ఆ బాధను తట్టుకోలేరు. కొంతమంది తమ పిల్లలను..బాధత్యలను గుర్తు చేసుకుని.. తమ భాగస్వామిని గుర్తు చేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తారు. అయితే మరి కొందరు జీవిత భాగస్వామి మరణాన్ని తట్టుకోలేక అవతలివారిని అనుసరిస్తూ.. కానరాని లోకాలను వెళ్ళిపోతారు. తాజాగా ఇటువంటి విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని విషాద ఘటన జరిగింది. తోటూరు గ్రామానికి చెందిన భర్తు సుందరరావు(55) భార్య పుణ్యవతి(48) లకు ఇద్దరు కుమారు. అయితే భార్యాభర్తలు కలిసి ఉపాధి రీత్యా బిలాయ్‌లో నివసిస్తున్నారు. కుర్సీపార్ ఇందిరాగాంధీ విద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. అయితే సుందరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం అనారోగ్యంతో మరణించారు. భర్త మరణాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది. దిగులుతో భర్త మరణించిన 24 గంటలు కాకముందే.. సోమవారం మధ్యాహ్నం మృతి చెందింది. కొన్ని గంటల తేడాతో కుటుంబంలో ఇద్దరు సభ్యులు మరణించడంతో విషాదం నెలకొంది.
ఇప్పటికే పెద్ద కొడుక్కి పెళ్లి అయింది. రెండో కుమారుడికి ఈనెల 20న పెళ్లి చేయాలనీ భావించారు. కొన్ని అనివార్య కారణాలతో పెళ్లి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..