AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NDA Chandrababu: శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..!

ఎన్డీయే -1 లో చంద్రబాబు శాసించే స్థాయిలో ఉండేవారు. మరి అదే ఎన్డీయే 2.0లో బాబు పరిస్థితి ఏంటి? శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి వచ్చారా? చక్రం తిప్పే స్థాయి నుంచి, బీజేపీ పెద్దల అనుగ్రహం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

NDA Chandrababu: శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..!
Chandrababu Pm Modi
Balaraju Goud
|

Updated on: Mar 10, 2024 | 10:35 AM

Share

ఎన్డీయే -1 లో చంద్రబాబు శాసించే స్థాయిలో ఉండేవారు. మరి అదే ఎన్డీయే 2.0లో బాబు పరిస్థితి ఏంటి? శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి వచ్చారా? చక్రం తిప్పే స్థాయి నుంచి, బీజేపీ పెద్దల అనుగ్రహం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. ఈ సందర్భంగా చంద్రబాబు మా పాత మిత్రుడే.1996 నుంచి మాతో ప్రయాణం చేస్తున్నారు అంటూ పాత జ్ఞాపకాలను, ఆనాటి స్నేహాలను తన లేఖలో నెమరు వేసుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.

అయితే అప్పటికి ఇప్పటికి చాలా తేడాలే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అప్పట్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఢిల్లీ వెళితే…రాజు వెడలె రవితేజములలరగా అన్నట్లు ఉండేది. ఎన్డీయే -1 టైమ్‌లో చంద్రబాబు టైమ్‌ అద్భుతంగా ఉండేది. 1999 నుంచి 2004 వరకు నడిచిన ఎన్డీయే పాలనలో చంద్రబాబు హవా నడిచేది. ఎన్డీయే కన్వీనర్‌గానే కాకుండా కీలక నిర్ణయాల్లో చంద్రబాబు సలహాలు, సూచనలను వాజపేయి తీసుకునేవారని చెబుతారు. అప్పుడు ఎన్డీయేలో డెసిషన్‌ మేకర్‌గా కూడా చంద్రబాబు ఉండేవారంటారు. ఇక అప్పట్లో రాష్ట్రపతి పదవికి అబ్దుల్‌ కలామ్‌ పేరును ప్రతిపాదించి వాజపేయి, అద్వానీలను ఒప్పించింది తానే అంటారు చంద్రబాబు. ఇక వాజపేయి అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కూడా చంద్రబాబు సలహాయే కారణం అని చెబుతారు. అప్పట్లో ఎన్డీయేలో చంద్రబాబు అంతలా చక్రం తిప్పేవారని చెబుతారు.

అయితే ఇదంతా గతం. ఏవీ తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు అంటే.. ఎన్డీయేలో ఆనాటి చంద్రబాబు ప్రాభవం, వైభవం ఇప్పుడు మంచులా కరిగిపోయాయంటున్నారు విశ్లేషకులు. అప్పట్లో ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు వాజ్‌పేయి, అద్వానీ స్వాగతం పలికిన పరిస్థితి ఉంటే, ఇప్పుడు పొత్తుల కోసం ఢిల్లీ బీజేపీ పెద్దల చుట్టూ చంద్రబాబే తిరగాల్సిన స్థితి వచ్చిందంటున్నారు విశ్లేషకులు.

ఎంతో కాలం నుంచి బీజేపీతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల సందర్భంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మాటామంతీ కలిపారు చంద్రబాబు. ఆ తర్వాత నెలన్నర క్రితం అమిత్‌ షాతో చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. తాజాగా రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు చంద్రబాబు. అయితే టీడీపీతో బీజేపీ కలవడం వెనుక చంద్రబాబు కన్నా పవన్‌ కల్యాణే కీలక పాత్ర పోషించారనే మాట కూడా వినిపిస్తోంది. టీడీపీని బీజేపీతో కలపడం కోసం ప్రయత్నించి, కాషాయ పార్టీ జాతీయ నాయకత్వంతో చీవాట్లు కూడా తిన్నానని ఆమధ్య పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ మొదట్లో సిద్ధంగా లేదని పవన్‌ చెప్పకనే చెప్పారు. ఒకప్పుడు ఎన్డీయేలో చక్రం తిప్పిన చంద్రబాబుకు, అదే ఎన్డీయేలో రీ ఎంట్రీ కోసం పవన్‌ చక్రం తిప్పాల్సి వచ్చింది. అంటే ఎన్డీయేలో శాసించే స్థాయి నుంచి ఆశించే స్థాయికి చంద్రబాబు వచ్చారా అనేదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
కష్టపడిన విలువ రాదు.. జబర్దస్త్ రోహిణి..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..
ఆ 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ..