Anandaiah Natu Mandu: మ‌రో సెన్సేష‌న్… కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందుపై హైకోర్టులో పిటిషన్

ఆనంద‌య్య నాటు మందు.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సెన్సేష‌న్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే హాట్ టాపిక్. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వాలు, ఆరోగ్య సంస్థ‌ల ప‌రిధిలో....

Anandaiah Natu Mandu: మ‌రో సెన్సేష‌న్... కృష్ణపట్నం ఆనందయ్య నాటు మందుపై హైకోర్టులో  పిటిషన్
Anandayya Ayurvedic Medicine
Follow us
Ram Naramaneni

|

Updated on: May 24, 2021 | 7:58 PM

ఆనంద‌య్య నాటు మందు.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సెన్సేష‌న్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే హాట్ టాపిక్. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వాలు, ఆరోగ్య సంస్థ‌ల ప‌రిధిలో ఉన్న ఈ విష‌యం ఇప్పుడు కోర్టుకు వెళ్లింది. ఆనందయ్య నాటు మందుపై ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ విచార‌ణ‌ అనుమతి కోసం హైకోర్టు న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేశారు. అనంతపురానికి చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున న్యాయ‌వాది ఈ పిటిష‌న్ వేశారు. ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారని, దాన్ని తీసుకుని చాలామంది కోలుకున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. అయితే, ప్ర‌భుత్వం ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయ‌డం వ‌ల్ల‌.. అనేక మంది ఈ మందును తీసుకోలేకపోతున్నారని పిటిషనర్ హైకోర్టుకు విన్న‌వించారు. దీనిపై విచారణకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ పిటిషన్ విచారణపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.

మరోవైపు ఆనందయ్య మందు పంపిణీపై స‌స్పెన్స్ కొనసాగుతోంది. ఈ మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఆయుష్ చెప్పింది. అయితే ఐసీఎంఆర్.. ఈ మందు విష‌యంలో జోక్యం చేసుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం లేదు. దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేసి అతి త్వ‌ర‌గా నివేదిక ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ ఆయూష్ టీమ్‌ను ఆదేశించారు. అప్ప‌టివ‌ర‌కు మందు పంపిణీని ఆపాల‌ని సూచించారు.

Also Read: తెలంగాణ ఓపెన్ స్కూల్ ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ పొడ‌గింపు.. ఎప్ప‌టి వ‌ర‌కంటే..

ప్రియుడితో క‌లిసి సొంత ఇంటికే క‌న్నం.. ఎలా దొరికారంటే