AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime News: ప్రియుడితో క‌లిసి సొంత ఇంటికే క‌న్నం.. ఎలా దొరికారంటే

అత‌డి ఇంటికి ఎవ‌రూ వచ్చిన‌ట్లు లేదు. కానీ ఇంట్లోని గోల్డ్, వెండి మిస్ అవుతున్నాయి. ఇలా ఒక‌సారి కాదు.. రెండు సార్లు జ‌రిగింది. దీంతో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

Telangana Crime News: ప్రియుడితో క‌లిసి సొంత ఇంటికే క‌న్నం.. ఎలా దొరికారంటే
Woman Arrested
Ram Naramaneni
|

Updated on: May 24, 2021 | 7:29 PM

Share

అత‌డి ఇంటికి ఎవ‌రూ వచ్చిన‌ట్లు లేదు. కానీ ఇంట్లోని గోల్డ్, వెండి మిస్ అవుతున్నాయి. ఇలా ఒక‌సారి కాదు.. రెండు సార్లు జ‌రిగింది. దీంతో పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు టెక్నాల‌జీ ఉప‌యోగించి.. ద‌ర్యాప్తు జ‌ర‌ప‌డంతో ఆ ఇంటి ఇల్లాలు భాగోతం వెలుగులోకి వ‌చ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన శివప్రకాశ్‌ అనే వ్య‌క్తి ..  ఈనెల 5న తన ఇంట్లో దొంగతనం జరిగిందని.. 40 తులాల బంగారం చోరీకి గురైందని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తిరిగి ఈనెల 20న మరో 1,330 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి క‌నిపించ‌డం లేద‌ని మరోమారు అదే పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీసీఎస్ పోలీసుల‌ను రంగంలోకి దించారు పోలీస్ బాస్‌లు. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌, సీసీ విజువ‌ల్స్ ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు శివప్రకాశ్‌ భార్య, గుంటూరుకు చెందిన బత్తుల వెంకట కృష్ణప్రసాద్‌లు నిందితులుగా గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.

ప్రియుడితో క‌లిసి చోరీ..

శివప్రకాశ్‌ గుంటూరుకు చెందిన అర్చనను 2008లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. కారేపల్లిలో నివాసం ఉంటున్నారు. గొడ‌వ‌ల కార‌ణంగా అర్చన గతేడాది భర్త నుంచి విడిపోయి.. గుంటూరులో నివాసం ఉంటోంది. ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన బత్తుల వెంకట కృష్ణప్రసాద్‌తో అక్ర‌మ‌ సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. నెల రోజుల క్రితం భర్త శివప్రకాశ్‌ తల్లి మ‌ర‌ణించ‌డంతో అర్చన కారేపల్లికి వచ్చింది. అప్పటి నుంచి అక్క‌డే ఉంటుంది. ఈ క్రమంలోనే మే 3వ తేదీ రాత్రి వెంకట కృష్ణప్రసాద్‌ను ఇంటికి పిలిపించి బంగారం, వెండి ఇచ్చి ర‌హస్యంగా పంపించేసింది. చోరీ జరిగిన విషయాన్ని 5వ తేదీన గుర్తించిన శివప్రకాశ్‌.. పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఈ మేరకు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని.. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Also Read:  తెలంగాణ ఓపెన్ స్కూల్ ఫీజు చెల్లింపు చివ‌రి తేదీ పొడ‌గింపు.. ఎప్ప‌టి వ‌ర‌కంటే..

 వెదురు ఆకులతో అదిరిపోయే ఛాయ్.. రుచి చాలా మ‌ధుర‌మ‌ట‌

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!