AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలోని నిరుద్యోగుకుల ముఖ్య గమనిక.. భారీగా వాలంటీర్‌ పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ..

Last Date for Job Application: కరోనా కష్ట కాలంలోనూ భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది ఏపీ సర్కార్. ఒకేసారి భారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం 2021 మే 20-25 (మంగళవారం) ఆఖరు తేదీ.

ఏపీలోని నిరుద్యోగుకుల ముఖ్య గమనిక.. భారీగా వాలంటీర్‌ పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేసేందుకు ఆఖరు తేదీ..
Ap Govt
Sanjay Kasula
|

Updated on: May 24, 2021 | 8:21 PM

Share

నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. కరోనా కష్ట కాలంలోనూ భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తోంది ఏపీ సర్కార్. ఒకేసారి భారీగా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అత్యంత చేరువ చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చింది. జీతాలు కాస్త తక్కవగానే ఉన్నా.. భారీగా ప్రోత్సహాకాలు ఇస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.. వివిధ జిల్లాల్లో గ్రామ/వార్డ్‌ సచివాలయ వాలంటీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వాలంటీరుకు కావాల్సిన అర్హతలు ఇవే.. పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించాలి. స్థానిక గ్రామ లేదా వార్డ్‌ పరిధిలో నివశిస్తూ ఉండాలి. వయసు మాత్రం 18–35 ఏళ్ల మధ్య ఉండాలి. జిల్లాల వారిగా చూస్తే శ్రీకాకుళం–397, నెల్లూరు–1006, చిత్తూరు–569, ప్రకాశం–296. అయితే భారీగా వాలంటీర్ పోస్టుల భర్తీ చేస్తోంది. అయితే దరఖాస్తు చేసుకునేందుకు మాత్రం 2021 మే 20-25 (మంగళవారం) ఆఖరు తేదీ.

పోస్టులు: గ్రామ/వార్డ్‌ సచివాలయ వలంటీర్‌లు
మొత్తం పోస్టుల సంఖ్య: 2268
జిల్లాల వారీగా పోస్టులు: శ్రీకాకుళం-397, నెల్లూరు-1006, చిత్తూరు-569, ప్రకాశం-296.
అర్హతలు: పదో తరగతి/ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించాలి.స్థానిక గ్రామ/వార్డ్‌ పరిధిలో నివశిస్తూ ఉండాలి.
వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
 దరఖాస్తులకు చివరి తేది: 2021 మే 20-25 (జిల్లాల వారీగా వివిధ చివరి తేదీలు ఉంటాయి)

వెబ్‌సైట్‌: https://gswsvolunteer.apcfss.in

ఇవి కూడా చదవండి : 5,656 మద్యం బాటిళ్లు ధ్వంసం… మహిళా శక్తితోనే ఈ మహమ్మారికి చెక్ పెట్టాలంటున్న పోలీసులు

ప్రైవేటు ఆస్పత్రులను స్వాధీనం చేసుకుని.. ఉచిత వైద్యం అందించండి..! ప్రభుత్వానికి మావోయిస్టుల లేఖ..!