AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: కదులుతున్న బస్సులోనుంచి దూకిన యువతి..కట్ చేస్తే.. తల్లి కూడా జంప్.. చివరికి..

బస్సు వేగంగా వెళుతున్న సమయంలో సీటులో కూర్చున్న యువతి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి గేటు లోంచి కిందికి దూకిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. తనను కాపాడేందుకు తల్లి కూడా వెంటనే బస్సులో నుంచి దూకింది. అంతే ఈ సంఘటన చూసి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ ఏం జరుగుతుందో తెలియక నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు.

AP News: కదులుతున్న బస్సులోనుంచి దూకిన యువతి..కట్ చేస్తే.. తల్లి కూడా జంప్.. చివరికి..
A Women And Her Mother Jumped From Running Bus In Kadapa
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Nov 25, 2024 | 9:24 PM

Share

ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి ఓ యువతి అర్ధాంతరంగా కిందకు దూకేసింది . బస్సు వేగంగా వెళుతున్న సమయంలో సీటులో కూర్చున్న యువతి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి గేటు లోంచి కిందికి దూకిన సంఘటన కడప జిల్లాలో జరిగింది. తనను కాపాడేందుకు తల్లి కూడా వెంటనే బస్సులో నుంచి దూకింది. అంతే ఈ సంఘటన చూసి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ ఏం జరుగుతుందో తెలియక నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు.

కడప జిల్లా పులివెందుల టౌన్ రోటరీ పురానికి చెందిన శ్రీలేఖ అనే యువతి ఆమె తల్లి సులోచన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గండి దేవాలయంలో  వీరాంజనేయ స్వామి గుడిని దర్శించుకున్నారు. అయితే రాయచోటి సమీపంలో ఓ స్వామీజీ మానసిక స్థితి లోపించిన వారికి బాగు చేస్తారు అని తెలియడంతో తన కుమార్తెను తీసుకొని రాయచోటి సమీపంలోని గుడికి వెళ్లి అక్కడ రాత్రి నిద్ర చేసి తిరిగి పులివెందులకు ప్రయాణిస్తున్న సమయంలో రాయచోటి చక్రాయపేట మధ్యలో బస్సు ప్రయాణిస్తున్న సమయంలో బస్సులో కూర్చున్న యువతి శ్రీలేఖ ఒక్కసారిగా లేచి హఠాత్తుగా పరిగెడుతూ బస్సు డోర్ దగ్గరకు వెళ్లి ఒక్కసారిగా అందులో నుంచి దూకేసింది ఇదంతా కనురెప్ప పాటలో జరిగిపోయింది. అయితే కూతురు బస్సు దూకిన వెంటనే తల్లి సులోచన కూడా కూతురిని కాపాడే ప్రయత్నంలో బస్సు దూకేసింది. అంతే ప్రయాణిస్తున్న నివ్వెరపోయి చూస్తూ ఉండిపోయారు. అయితే వీరిని వెంటనే వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా తల్లి సులోచనకు తలకు స్వల్ప గాయాలు కాగా యువతి శ్రీలేఖకు బలమైన గాయాలు కావడంతో ఆ యువతిని కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆ యువతీ తల్లి మాట్లాడుతూ.. శ్రీలేఖకు కొంచెం అనారోగ్య సమస్యలు మరియు అప్పుడప్పుడు కొంచెం ప్రవర్తనలో తేడా రావడంతో స్వామీజీ దగ్గరకు వెళ్లి వస్తున్నామని ఈ క్రమంలో హఠాత్తుగా బస్సులో ప్రయాణిస్తూ కిందకు దూకేసిందని, దేవాలయానికి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని వివరించింది. ఇంతకీ యువతి బస్సు హఠాత్తుగా ఎందుకు దూకిందో తల్లికి కూడా తెలియని పరిస్థితి ఏది ఏమైనా యువతి ఒక్కసారిగా బస్సులోంచి హఠాత్తుగా దూకి వేయడంతో బస్సులోని వాళ్లంతా ఆశ్చర్యపోయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి