Ap Corona Updates: ఆంధ్రప్రదేశ్ కరోనా బులెటిన్ విడుదల.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

ఆంధ్రప్రదేశ్ కరోనా బులెటిన్ విడుదలయ్యింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. ఎంతోకొంత మంది వైరస్ బారిన పడుతూనే ఉన్నారు.

Ap Corona Updates: ఆంధ్రప్రదేశ్ కరోనా బులెటిన్ విడుదల.. తాజాగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Andhra Pradesh Corona Updates
Follow us

|

Updated on: Feb 22, 2021 | 6:54 PM

ఆంధ్రప్రదేశ్ కరోనా బులెటిన్ విడుదలయ్యింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా.. ఎంతోకొంత మంది వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 41 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 18,257 శాంపిల్స్ పరీక్షించగా.. 41 మందికి పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. ఇక కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ఇదే సమయంలో 24 గంటల్లో 71 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8,89,339 మందికి కరోనా సొకగా.. 8,81,582 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా 7,167 మంది మృత్యువాత పడ్డారు.

ఇదిలాఉండగా, తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 10 కేసులు నమోదవగా.. ఆ తరువాత తూర్పు గోదావరి 7, నెల్లూరు 6, శ్రీకాకుళం 4, పశ్చిమ గోదావరి 4 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

Also read:

ఇండియాతో గొడవెందుకు ? పార్లమెంటులో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పీచ్ ని రద్దు చేసిన శీలంక

అసుపత్రి బెడ్ టు సర్పంచ్ సీటు..4 ఓట్లతో మరొకరు గెలుపు.. పంచాయితీ పోరులో సిత్రాలెన్నో!