ఇండియాతో గొడవెందుకు ? పార్లమెంటులో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పీచ్ ని రద్దు చేసిన శ్రీ లంక

ఇండియాతో సమస్య తెచ్చుకోరాదని భావించిన శ్రీలంక ప్రభుత్వం  ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. తమ దేశ పార్లమెంటులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేయదలచిన..

ఇండియాతో గొడవెందుకు ? పార్లమెంటులో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పీచ్ ని రద్దు చేసిన శ్రీ లంక
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 22, 2021 | 7:44 PM

ఇండియాతో సమస్య తెచ్చుకోరాదని భావించిన శ్రీలంక ప్రభుత్వం  ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. తమ దేశ పార్లమెంటులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేయదలచిన ప్రసంగ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఈ మేరకు కొలంబో గెజిట్ ఓ రిపోర్టును ప్రచురించింది. అసలే చైనా నుంచి తలెత్తిన అప్పుల భారంతో కూరుకుపోయామని, మరో వైపు కోవిడ్ భయం ఇంకా తొలగిపోలేదని, అలాంటి ఈ తరుణంలో ఇమ్రాన్ ప్రసంగాన్ని అనుమతిస్తే ఇండియాతో తగవు తెచ్చుకున్నట్టే అవుతుందని ఈ నివేదికలో పేర్కొన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్లను అందజేయడంలో ఇండియా ప్రపంచంలోనే ఆపన్న దేశంగా పేరు తెచ్చుకుంది. ఇటీవలే శ్రీలంకకు భారత్ 5 లక్షల డోసుల కోవిషేల్డ్ వ్యాక్సిన్ ను పంపింది. ఇటీవలి నెలల్లో కొలంబోలో ముస్లిం వ్యతిరేక సెంటిమెంట్లు పెరుగుతున్నాయి. మసీదుల్లో ముస్లిములు చేస్తున్న జంతుబలులను  బౌద్దులు తీవ్రంగా  వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇమ్రాన్ ఖాన్ ఇక్కడికి వచ్చి.. పార్లమెంటులో ప్రసంగిస్తే ముస్లిం కార్డును ఆయన ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని, అది మంచిది కాదని కొలంబో ప్రభుత్వం భావిస్తోంది.

గత ఏడాది ఇమ్రాన్  ఆఫ్ఘనిస్థాన్ ని విజిట్ చేసినప్పుడు ఇలాగె ముస్లిం అంశాన్ని లేవనెత్తారు.  2012 లో ఆయన తాలిబన్లను సమర్థించారని, వారి ఉగ్రవాద కార్యకలాపాలను పవిత్ర యుద్డంగా అభివర్ణించారని శ్రీలంక ప్రభుత్వ అధికారి ఒకరు గుర్తు చేశారు. గత ఏడాది అక్టోబరులో ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండించిన ఆ దేశాధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రోన్ వ్యాఖ్యలను ముస్లిం దేశాలన్నీ తీవ్రంగా పరిగణించాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారని కూడా ఆయన అన్నారు. అలాంటి వ్యక్తికి  ఇక్కడ పార్లమెంటులో ప్రసంగించడానికి అవకాశం ఇస్తే అది ఆత్మహత్యా సదృశమే అవుతుందని ఈ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా-శ్రీలంక నిర్ణయంతో ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది.

Also Read:

Petrol and diesel price: వాహనదారులకు పెద్ద ఊరట.. పెట్రోల్ ధరలను భారీగా తగ్గించిన రాష్ట్రాలు..

విశ్వసానికి మారు పేరు కుక్క.. అన్నం పెట్టిన యజమానికోసం ఈ శునకం ఏం చేసిందో మీరే చూడండి..