AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గుంటూరు జంక్షన్ యార్టు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం.. ఎన్నికోట్లు మంజూరు చేశారంటే

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో అతిపెద్ద కూడలిగా గుర్తింపు పొందిన గుంటూరు జంక్షన్‌ యార్డు ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. కొన్నేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు కోసం అధికారులు చేస్తున్న కృషి ఫలించింది.

Andhra Pradesh: గుంటూరు జంక్షన్ యార్టు ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం.. ఎన్నికోట్లు మంజూరు చేశారంటే
Guntur Railway Junction
Aravind B
|

Updated on: Apr 23, 2023 | 9:34 AM

Share

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో అతిపెద్ద కూడలిగా గుర్తింపు పొందిన గుంటూరు జంక్షన్‌ యార్డు ఆధునికీకరణ పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. కొన్నేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు కోసం అధికారులు చేస్తున్న కృషి ఫలించింది. అయితే తాజగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన గతిశక్తి ప్రాజెక్టు కింద రూ.125.16 కోట్లు మంజూరు చేశారు. సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మరో వారం రోజుల్లో ఇందుకోసం టెండర్లు పిలిచేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే గుంటూరు స్టేషన్‌ మీదుగా వెళ్లనున్న రైళ్ల సంఖ్య పెరిగే అవకాశముంది. దీంతో ఆదాయం కూడా పెరుగుతుంది.

గతిశక్తి కింద మంజూరైన ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధాకారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక నిధుల కొరత లేనందున పనులు వేగంగా జరుగుతాయని భావిస్తున్నారు. అత్యంత వేగంగా నిర్మాణ పనులు పూర్తిచేసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. గుంటూరు రైల్వే స్టేషన్‌ మీదుగా రోజూ కనీసం 100 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.అయినప్పటికీ పూర్తి స్థాయిలో రైళ్లను నిలపడం సమస్యగా మారింది. రెండు ప్లాట్‌ ఫారాలు మినహా మిగిలిన వాటిలో 24 బోగీలు నిలిపే స్థలం లేదు. పురాతన కాలంనాటి సిగ్నల్‌ వ్యవస్థ కావడంతో త్వరగా స్టేషన్లోకి రైళ్లను అనుమతించడం ఇబ్బందికరంగా తయారైంది. గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా అరండల్‌పేట వైపు కొత్తగా 8వ లైను నిర్మించనున్నారు.

ఆధునికీకరణ పనులు పూర్తయితే అన్ని ప్లాట్‌ ఫారాల మీద 24 బోగీలు నిలిపే సౌకర్యం రానుంది. రైళ్ల రాకపోకల్లోను సమయం ఆదా అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ సౌకర్యం లేనందున నల్లపాడు, సిరిపురం స్టేషన్లలో ఆ రైళ్లను నిలిపి ఉంచుతున్నారు. అదేవిధంగా స్టేషన్లోని ప్రధాన మార్గం నుంచి లూప్‌లైన్‌ వరకు పాయింట్స్‌, క్రాసింగ్స్‌ మార్చనున్నారు. గుంటూరు నుంచి కేసీకెనాల్‌ వైపు, తెనాలి మార్గం వైపు వెళ్లే రైళ్లు రెండు లైన్ల నుంచి ఒకేసారి వెళ్లే సదుపాయం కలగనుంది. ఈ పనులను వేగంగా పుర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే