Narayana Arrest: ఏపీలో మాల్‌ ప్రాక్టీస్‌ ప్రకంపనలు.. మాజీ మంత్రి నారాయణ సహా 60 మందిపై క్రిమినల్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం నారాయణ విద్యా సంస్థల యజమాని, మాజీ మంత్రి పి.నారాయణ మెడకు చుట్టుకుంది.

Narayana Arrest: ఏపీలో మాల్‌ ప్రాక్టీస్‌ ప్రకంపనలు.. మాజీ మంత్రి నారాయణ సహా 60 మందిపై క్రిమినల్‌ కేసులు
Narayana Arrest
Follow us

|

Updated on: May 10, 2022 | 3:16 PM

Former Minister Narayana Arrest: ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌ పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం నారాయణ విద్యా సంస్థల యజమాని, మాజీ మంత్రి పి.నారాయణ మెడకు చుట్టుకుంది. ఆయనకు చెందిన విద్యా సంస్థల నుంచే టెన్త్‌ పరీక్ష పేపర్లు లీక్‌ అయ్యాయని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ మధ్యే స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పి.నారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ – ప్రివెన్షన్‌ ఆఫ్ మాల్‌ప్రాక్టీసెస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌ చట్టంలోని సెక్షన్‌ 5, 8తో పాటు ఐపీసీ సెక్షన్‌ 408 కింద కేసు నమోదు చేశారు.

గత నెల 27న ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. మొదటి పరీక్ష తెలుగు, తమిళ్‌, ఉర్దూ. ఈ పరీక్ష ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైంది. కాసేపటికి తెలుగు పేపర్‌ కొన్ని వాట్సప్‌ గ్రూప్స్‌లో సర్క్యూలేట్‌ అయింది. ఈ క్రమంలో చిత్తూరు టీవీ 9 రిపోర్టర్‌ జైరాజ్‌కు ఈ విషయం తెలిసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆయన పేపర్‌ లీకేజ్‌ వ్యవహారాన్ని చిత్తూలు జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వాట్సాప్‌లో సర్క్యూలేట్‌ అవుతున్న పేపర్‌ తనకు పంపించమని జైరాజ్‌కు సూచించారు. ఆయన సమయంలో జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం చిత్తూరు గ్రీమ్స్‌ రోడ్‌లోని నారాయణ జూనియర్‌ కాలేజీలో తనిఖీలు చేశారు. వాట్సప్‌లో సర్క్యూలేట్‌ అవుతున్న కొశ్చన్‌ పేపర్‌ను అసలు పేపర్‌ను DEO పరిశీలించగా రెండు ఒక్కటేనని గుర్తించారు. వెంటనే ఆయన పేపర్‌ లీకేజీపై దర్యాప్తు చేయాలని కోరుతూ చిత్తూరు వన్‌ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.

DEO పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీసులు ఏప్రిల్‌ 27న కేసు నమోదు చేశారు. 111/2022 తో కేసు నమోదు చేశారు. DEO ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఉదయం నారాయణ విద్యా సంస్థల అధిపతి పి.నారాయణను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి తప్పిదాలకు అస్కారం లేకుండా తాము చర్యలు చేపట్టామని, తమ నుంచి పరీక్ష పత్రం లీకేజీ అయ్యే అవకాశం అణువంత కూడా లేదని DEO పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాదు పరీక్షకు ముందే పేపర్‌ బయటకు వస్తే దాన్ని లీకేజ్ అంటారని, కాని ఈ పేపర్‌ కావాలనే కొందరు ఫొటోలు తీసి వాట్సప్‌లో సర్క్యూలేట్‌ చేశారని ఫిర్యాదులో తెలిపారు. ప్రభుత్వ విద్యా విభాగాన్ని అప్రతిష్ఠ పాల్జేసేందుకు కొందరు దుర్మార్గాలు ప్రయత్నించారని తన ఫిర్యాదులో చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తం పేర్కొన్నారు. అయితే, మాల్‌ప్రాక్టీసెస్‌ చట్టం కింద దోషిగా తేలితే కనిష్ఠంగా మూడు సంవత్సరాలు, గరిష్ఠంగా ఏడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు కనీసం ఐదు వేల నుంచి గరిష్టంగా లక్ష రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌ ఐకియా షోరూమ్‌ దగ్గర నారాయణను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు నారాయణ కారులో ఆయనకు చిత్తూరుకు తీసుకెళ్లారు. నారాయణ అరెస్టు విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడం, మీడియాలో హడావుడి చోటుచేసుకోవడంతో నారాయణ ప్రయాణిస్తున్న కారును తెలంగాణ పోలీసులు కొత్తూరు టోల్‌గేట్‌ సమీపంలో ఆపారు. ఏపీ పోలీసులు FIR కాపీని చూపించడం, దాన్ని తెలంగాణ పోలీసులు ఉన్నతాధికారులకు పంపించడం, వారి నుంచి ఆమోదం రావడంతో నారాయణను పోలీసులు చిత్తూరుకు తీసుకెళ్లారు.

ఇదిలావుంటే, పదో తరగతి పరీక్షల నిర్వహణలో.. ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అయినా వాట్సప్ గ్రూపుల్లో పేపర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ తతంగం ఒక్క పేపర్‌తో ఆగిపోలేదు. ఏ రోజు ఎగ్జామ్‌ జరిగితే.. ఆ పేపర్‌కి సంబంధించిన ప్రశ్నలు బయటికొచ్చాయి. అసలు పరీక్షా కేంద్రాల్లో ఏం జరిగింది? ఒక్కసారి పరిశీలిద్దాం..

గత నెల ఏప్రిల్ 27న టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. అదే రోజు ఉదయం 9.57 నిమిషాలకు తెలుగు క్వశ్చన్ పేపర్‌ వాట్సప్‌ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. ఊహించని ఘటనతో అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు ఉలిక్కిపడ్డారు. సీన్‌లోకి ఎంటరైన పోలీసులు మాల్‌ ప్రాక్టీస్ సూత్రధారి తిరుపతి నారాయణ కాలేజీకి వైస్ ప్రిన్సిపల్‌ గిరిధర్ రెడ్డిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఏప్రిల్‌ 28న హిందీ ఎగ్జామ్ జరిగింది. ఆ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్‌ 10 గంటల 2నిమిషాలకు వాట్సప్‌లో చక్కర్లు కొట్టింది. శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో హిందీ పేపర్‌ ఎక్కువగా సర్క్యూలేట్ అయింది. ఏప్రిల్ 29న జరిగిన ఇంగ్లీష్ పేపర్‌.. 9గంటల 38 నిమిషాలకు వాట్సప్‌ గ్రూపుల్లో కనిపించింది. శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాలో మాల్‌ ప్రాక్టిస్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. మే 2న జరిగిన మ్యాథ్స్‌ క్వశ్చన్ పేపర్‌ కూడా ఎగ్జామ్‌కి పది నిమిషాల ముందే బయటకు వెళ్లింది. ఒంగోలు జిల్లాలో జాతిరత్నాలు అనే వాట్సప్ గ్రూప్‌లో సర్క్యులేట్ అయింది.

ఎగ్జామ్‌ జరగడం.. మాల్‌ ప్రాక్టీస్ కావడం సర్వ సాధారణంగా మారిపోయింది. వీటికి సంబంధించి 60మందికి పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వారు 36మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మరో ఇద్దరు ఆఫీస్ సిబ్బంది ఉన్నారు. నారాయణ, చైతన్య సంస్థల్లో మాల్‌ ప్రాక్టీస్‌కి సంబంధించి 22మంది సిబ్బందిపై కేసులు నమోదయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం 

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో