Nancy Pelosi: చట్టం ముందు ఎవరైనా ఒక్కటే.. యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త అరెస్ట్.. కారణం ఏంటంటే..
Nancy Pelosi: అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీని అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. ఆయనకు ఐదు రోజుల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది.
Nancy Pelosi: అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసీని అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. ఆయనకు ఐదు రోజుల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. మద్యం మత్తులో కారు నడపటమే కాకుండా, ఒకరిని గాయపరిచాడనే కారణంగా అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నాపా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం పాల్ పెలోసీ అరెస్ట్‌ను ధృవీకరించింది. పెలోసీ(82) మే 28న అరెస్ట్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేశారని, ఆ క్రమంలో ఒకరిని గాయపరిచారని అభియోగాలు మోపారు. అతని రక్తంలో 0.08 శాతం కంటే ఎక్కువ ఆల్కాహాల్ పర్సంటేజ్ ఉందని డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. అయితే, మే 28న జరిగిన ఈకేసులో పాల్ పెలోసీని తాజాగా దోషిగా తేల్చారు. అయనకు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన బాధితురాలికి 4,927 డాలర్ల వైద్య బిల్లులు, కోల్పోయిన వేతనాలు మొత్తం చెల్లించాలని డిస్ట్రిక్ట్ అటార్నీ ఆదేశించారు. అయితే, ఈ ఘటనలో పెలోసీ ఇప్పటికే 2 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. అయితే, కోర్టు నిబంధనల ప్రకారం మంచి ప్రవర్తన కలిగి ఉంటే.. రెండు రోజులకు మించి జైల్లో ఉండాల్సిన అవసరం లేదు. పెలోసీ ఇప్పటికే రెండు రోజులు జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రత్యేంగా జైలుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అగ్రరాజ్యం అమెరికా చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో దీనిని బట్టి అర్థం అవుతుంది. అదే మన వద్ద అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది.
ఇదిలాఉంటే.. నాన్సీ పెలోసీ పేరు ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. దీనికి బలమైన కారణమే ఉంది. తైవాన్‌ను తమ దేశంలో అంతర్భాగం అని, తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు చైనా అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, తైవాన్ మాత్రం దురాక్రమణ ప్రయత్నాలను ఖండిస్తూ వస్తోంది. ఈ క్రమంలో అమెరికా హౌస్ స్పీకర్ అయిన నాన్సీ పెలోసీ.. తైవాన్‌లో పర్యటించారు. ఆమె పర్యటన చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..