AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden: రిపబ్లికన్లతో ప్రజస్వామ్యానికి ముప్పు.. మిడ్‌టర్మ్‌ ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్..

కరోనా సంక్షోభకాలంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి దేశ నాయకత్వం చేపట్టిన బైడెన్‌ పరిపాలనకు పరీక్షగా నిలిచాయి మిడ్‌టర్మ్స్‌ ఎన్నికలు

Joe Biden: రిపబ్లికన్లతో ప్రజస్వామ్యానికి ముప్పు.. మిడ్‌టర్మ్‌ ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్..
Us President Joe Biden
Shaik Madar Saheb
|

Updated on: Aug 27, 2022 | 7:58 AM

Share

Joe Biden Election Speech: అగ్రరాజ్యం అమెరికా నవంబర్‌లో జరిగిగే మిడ్‌టర్మ్‌ ఎన్నికలకు సిద్దమవుతోంది. హౌస్‌ ఆఫ్‌ రిప్రజేంటేటివ్స్‌తో పాటు సెనెట్‌లోని 35 సీట్లకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఈ ఎన్నికలు జో బైడెన్‌ నేతృత్వంలోని డెమోక్రాట్స్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. కరోనా సంక్షోభకాలంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి దేశ నాయకత్వం చేపట్టిన బైడెన్‌ పరిపాలనకు పరీక్షగా నిలిచాయి మిడ్‌టర్మ్స్‌ ఎన్నికలు.. ద్రవోల్భణం, తుపాకులపై నియంత్రణ, అబార్షన్స్‌ బ్యాన్‌ తదితర అంశాల్లో అధ్యక్షునిగా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని బైడెన్‌ ఇప్పికే విమర్శలు ఎదుర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్స్‌కు తగినంత మెజారిటీ లేదు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు పుంజుకుంటే బైడెన్‌కు ఇక కష్టకాలమేనని చెప్పక తప్పదు. అయితే, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ క్యాపిటల్‌ హిల్స్‌పై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కోవడం బైడెన్‌కు కలిసొస్తోంది. ఈ ఉత్సాహంతో మేరీల్యాండ్‌ స్టేట్‌ రాక్‌విల్లేలో తన మద్దతుదారులలో సమావేశం ద్వారా మిడ్‌టర్మ్‌ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు ప్రసిడెంట్‌ జో బైడెన్‌.

తన పరిపాలనను సమర్ధించుకున్న బైడెన్‌.. మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌ అంటూ పిలుపునిచ్చారు. దేశం సమర్ధవంతమైన పాలనలో కొనసాగాలంటే రానున్న మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో డెమోక్రాట్‌ అభ్యర్ధులకు ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు బైడెన్‌. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే డెమోక్రాట్స్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్లతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందని ఆరోపించారు. వారు కోపం, హింస, ద్వేషం, హింసతో దేశాన్ని సెమీ ఫాసిజం దిశగా దేశాన్ని తీసుకెళ్లారని ధ్వజమెత్తారు బైడెన్‌. మరోవైపు విద్యార్థులపై రుణ భారాన్ని తగ్గిస్తే బైడెన్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌ పాస్‌ చేస్తూ సంతకం చేశారు.

కాగా.. గురువారం రాత్రి మేరీల్యాండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో జో బిడెన్ పాల్గొని ప్రసంగించారు. మేరీల్యాండ్‌లోని రాక్‌విల్లేలో ఉన్న మాంట్‌గోమెరీ హైస్కూల్‌లో అధ్యక్షుడి ప్రసంగానికి ఒక వ్యక్తి అంతరాయం కలిగించగా.. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బైడెన్ కు వ్యతిరేకంగా 2020 ఎన్నికలను దొంగలించావు అంటూ ఆ వ్యక్తి మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై బైడెన్ మండిపడ్డారు.. అజ్ఞానానికి సరిహద్దులు లేవంటూ ప్రసంగంలో అంతరాయం కలిగించిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..