Cyber Attack: అమెరికాలో సైబర్ అటాక్ కలకలం.. ప్రధాన ఇంధన పైప్‌లైన్‌ నిలిపివేత

US declares state of emergency as cyber attack: అమెరికాలో సైబర్ అటాక్‌తో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతోపాటు అమెరికా ఇంధన సరఫరాలో కీలకమైన తూర్పు తీర ఇంధన పైప్‌లైన్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పైప్‌లైన్‌ను

Cyber Attack: అమెరికాలో సైబర్ అటాక్ కలకలం.. ప్రధాన ఇంధన పైప్‌లైన్‌ నిలిపివేత
Us Declares State Of Emergency As Cyber Attack
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 10, 2021 | 9:21 AM

US declares state of emergency as cyber attack: అమెరికాలో సైబర్ అటాక్‌తో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతోపాటు అమెరికా ఇంధన సరఫరాలో కీలకమైన తూర్పు తీర ఇంధన పైప్‌లైన్‌ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ పైప్‌లైన్‌ను జార్జియాకు చెందిన కలోనియల్‌ పైప్‌లైన్‌ నిర్వహిస్తోంది. ఆ సంస్థపై రాన్సమ్‌వేర్‌ సైబర్‌దాడి జరగడంతో పైప్‌లైన్‌ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. ఈ నిలిపివేత ప్రభావం దేశంలోని ఇంధన సరఫరా, ధరలపై ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పైప్‌లైన్ మూసివేయడానికి గల కారణం.. డార్క్‌సైడ్ అని పిలువబడే ఒక క్రిమినల్ ముఠా అని అధికారులు తెలిపారు. అయితే ఈ సైబర్ క్రైం వ్యక్తులు పలు సంస్థలపై సైబర్ అటాక్ చేసి.. పెద్ద మొత్తంలో డబ్బులను డిమాండ్ చేస్తారు.

ఈ సైబర్ అటాక్‌తో దాదాపు మూడు రోజులుగా ఇంధన సరఫరా ప్రభావితం అయింది. సైబర్ అటాక్ నుంచి రక్షించేందుకు, అంతరాన్ని నివారించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు సంబంధించిన నిబంధనలను సడలించింది. అయితే.. జార్జియాకు చెందిన కలోనియల్ పైప్‌లైన్ ద్వారా టెక్సాస్ నుంచి ఈశాన్యానికి గ్యాసోలిన్.. ఇతర ఇంధనాన్ని సరఫరా చేస్తారు. ఇది తూర్పు తీరంలో వినియోగించే ఇంధనంలో సుమారు 45% సరఫరా చేస్తుందని కంపెనీ వెల్లడించింది.

అయితే ఈ దాడిని ర్యాన్సమ్‌వేర్‌గా అధికారులు ప్రకటించారు. హ్యాకర్లు సాధారణంగా డేటాను దొంగలించడం, నెట్‌వర్క్‌లను స్తంభింపజేయడం ద్వారా కంప్యూటర్ సిస్టమ్‌లను లాక్ చేస్తారు. ఆపై దానిని సజావుగా నడిచేందుకు డబ్బును డిమాండ్ చేస్తారు. అయితే.. ప్రస్తుతం హ్యాకర్లు ఏం డిమాండ్ చేశారన్నది అధికారులు వెల్లడించలేదు. కలోనియల్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Also Read:

Covid-19 Death: ఆ దేశంలో కరోనా తొలి మరణం.. పెరుగుతున్న కేసులతో వణుకుతున్న ప్రజలు

America Firing: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది దుర్మరణం

తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
తెలుగోడి దెబ్బ.. సౌతాఫ్రికా అబ్బా..బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు..
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా