America Firing: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది దుర్మరణం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రెండు వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 11 మంది ప్రాణాలను కోల్పోయారు.

America Firing: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. రెండు వేర్వేరు ఘటనల్లో 11 మంది దుర్మరణం
Eleven Killed In Mass Shooting 2 Different Places In America
Follow us
Balaraju Goud

|

Updated on: May 10, 2021 | 8:33 AM

US Mass Shoot dead : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. రెండు వేరు వేరు చోట్ల జరిగిన ఘటనల్లో 11 మంది ప్రాణాలను కోల్పోయారు. కొలిరాడోలోని ఓ మొబైల్‌ హోం పార్క్‌లో పుట్టినరోజు వేడుకల్లో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏడుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్న కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి ప్రవేశించిన వ్యక్తి కాల్పులు జరిపినట్లు తెలిపారు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

అటు ఉడ్‌ల్యాండ్‌లో ఓ వ్యక్తి ఇరుగుపొరుగువారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురు మృతిచెందారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడు కాల్పులు జరిపిన ఇంటికి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో నిందితుడికి పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీంతో నిందితుడు హతమైనట్లు అధికారులు వెల్లడించారు

Read Also…  Covid-19 Death: ఆ దేశంలో కరోనా తొలి మరణం.. పెరుగుతున్న కేసులతో వణుకుతున్న ప్రజలు