Covid-19 Death: ఆ దేశంలో కరోనా తొలి మరణం.. పెరుగుతున్న కేసులతో వణుకుతున్న ప్రజలు

Laos records first Covid-19 death: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు

Covid-19 Death: ఆ దేశంలో కరోనా తొలి మరణం.. పెరుగుతున్న కేసులతో వణుకుతున్న ప్రజలు
Laos Records First Covid 19 Death
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 10, 2021 | 8:12 AM

Laos records first Covid-19 death: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మరణాలు నమోదవుతున్నాయి. దీంతో అంతటా ఆందోళన నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. వైరస్‌ నియంత్రణలోకి రావడం కష్టంగా మారింది. కోవిడ్-19 చైనాలో వెలుగులోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావొస్తున్నా కొన్ని ప్రాంతాల్లో కేసులు అదుపులోనే ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అస్సలు కేసులు నమోదు కాకపోవడం విశేషం. ప్రస్తుతం అలాంటి దేశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ కేసులు నమోదైనా మరణాలు సంభవించడం లేదు. అయితే తాజాగా ఆగ్నేయ ఆసియాలోని పర్యాటక దేశం లావోస్‌లో మొదటిసారిగా కోవిడ్ మరణం నమోదైంది. ఏడాదిన్నర కాలంలో కరోనా మరణం సంభవించడం ఇదే తొలిసారని ఆదేశం వెల్లడించింది.

రాజధాని వియంటియాన్‌లో 53 ఏళ్ల వియత్నామీస్ క్లబ్ కార్మికురాలు వైరస్ బారినపడి మరణించినట్లు నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఫర్ కోవిడ్ -19 ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆదివారం వెల్లడించింది. మధుమేహం, ఇతర సమస్యల వల్ల ఆ మహిళ పరిస్థితి విషమంగా మారి చనిపోయిందని పేర్కొంది. కాగా.. లావోస్‌లో ఏప్రిల్ 14న న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. అప్పటినుంచి ఆదేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం నాటికి దేశంలో మొత్తం 1,233 కేసులు మాత్రమే నమోదయ్యాయి, వీటిలో 1,184 కేసులు గత నెలలో నమోదయ్యాయి. అయితే.. శనివారం 28 కేసులు నమోదయ్యాయి.

అయితే.. వృద్ధులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారని, ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువ పొంచిఉందని ఆ దేశ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బౌథెప్ ఫోమిన్ ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. లావోస్ సుమారు 7.28 మిలియన్ల జనాభా ఉంది. అయితే.. ఇప్పటివరకు 1,84,387 మందికి కోవిడ్ -19 వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు.

Also Read:

Genetic Bioweapon: కరోనా వ్యాప్తి వెనుక ముమ్మాటికి కుట్రే.. ప్రపంచంపై చైనా బయో వార్.. ‘ది ఆస్ట్రేలియన్‌’ కథనం వెల్లడి

COVID-19: గాలిలో కరోనా వైరస్‌ ప్రభావం ఎన్ని అడుగుల దూరం వరకు ఉంటుందో తెలుసా..? మరోసారి క్లారిటీ ఇచ్చిన సీడీసీ