Trump Departed : శ్వేత సౌదంకు జస్ట్ గుడ్ బై..! వైట్ హౌస్ ముందు ట్రంప్ చివరి మాటలు..
జస్ట్ గుడ్ బై చెప్పాలనుకుంటున్నా అని అన్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసే సమయానికి ట్రంప్ ఫ్లోరిడాలోని తన రిసార్ట్ మార్ ఎ లగోలో...
Trump Departed : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌదంకు గుడ్ బై చెప్పారు. తన భార్య మెలానియా ట్రంప్‌తో కలసి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ఫ్లోరిడాకు వెళ్లిపోయారు. అక్కడే ఉండేందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నికల తర్వాత ట్రంప్ ప్రకటించినట్లుగానే జో బైడెన్, కొత్త ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లలేదు. ఓడిపోయిన అధ్యక్షుడు తన తర్వాత ప్రమాణస్వీకారం చేసే కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. ఓ అధ్యక్షుడు దిగిపోతూ కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారంకు హాజరు కాకపోవడం గడిచిన 150 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు.
#WATCH Donald Trump departs from the White House as the president for the last time, ahead of the inauguration of president-elect Joe Biden in Washington#USA pic.twitter.com/xS8eirurtf
— ANI (@ANI) January 20, 2021
వైట్ హౌస్ నుంచి ట్రంప్.. నేరుగా మెరైన 1 హెలికాప్టర్‌లో జాయింట్ బేస్ ఆండ్రూస్ వెళ్లారు. అక్కడి నుంచి అమెరికా అధ్యక్ష విమానం ఎయిర్ ఫోర్స్ 1 లో ఫ్లోరిడా వెళ్లారు. ఎప్పుడూ నవ్వుతూ సరదా ఉండే ట్రంప్.. వైట్ హౌస్‌ను వీడుతున్న సమయంలో మాత్రం కొంత ఉత్సాహంగా కనిపించలేదు.
He seems like a very happy old man looking forward to a bright and wonderful future. So nice to see! pic.twitter.com/G8gObLhsz9
— Greta Thunberg (@GretaThunberg) January 20, 2021
వైట్ హౌస్ వద్ద వేచి ఉన్న మీడియా ప్రతినిధులతో పొడిపొడిగా మాట్లాడారు. నాలుగేళ్లు అద్భుతంగా సాగాయని, జీవితంలో దక్కిన గౌరవం ఇదని అని అన్నారు. ఇది కేవలం.. జస్ట్ గుడ్ బై చెప్పాలనుకుంటున్నా అని అన్నారు. అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసే సమయానికి ట్రంప్ ఫ్లోరిడాలోని తన రిసార్ట్ మార్ ఎ లగోలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కూడా ట్రంప్ ఇష్టపడలేదని అతని సన్నిహితులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Kamala Harris Sworn : అమెరికా దేశ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ కొత్త చరిత్ర
Joe Biden Calls on Nation : నేను మీ వాడిని.. తొలి ప్రసంగంలోనే ఆకట్టుకున్న నూతన అధ్యక్షుడు జో బైడెన్