AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో తొలి యోగా విశ్వవిద్యాలయం

భారతదేశం బయట తొలి యోగా విశ్వవిద్యాలయం అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఏర్పాటైంది. ది వివేకానంద యోగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థాపించిన ఈ యూనివర్సిటీని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ ప్రారంభించారు.

అమెరికాలో తొలి యోగా విశ్వవిద్యాలయం
Balaraju Goud
|

Updated on: Jun 26, 2020 | 9:18 PM

Share

యోగా అన్న పదం సంస్కృతం నుంచి పుట్టింది. యోగా చేయడం వల్ల అనారోగ్య బారినపడరని, ఆరోగ్యం ఉంటారని పూర్వీకులు చెబుతున్నారు. సనాతన భారతీయ సాంప్రదాయంలో యోగా ఒక భాగం. కానీ 21వ శతాబ్దంలో మళ్లీ యోగాకు క్రేజీ ఏర్పడింది. ప్రపంచానికి యోగాను పరిచయం చేసింది భారత్‌. 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చే యోగా పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భారతదేశం బయట తొలి యోగా విశ్వవిద్యాలయం అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో ఏర్పాటైంది. ది వివేకానంద యోగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థాపించిన ఈ యూనివర్సిటీని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌, విదేశీ వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పీపీ చౌదరి, న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయంనుంచి సంయుక్తంగా వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ యూనివర్సిటీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు వక్తలు.