AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌కు ఫేస్‌బుక్ షాక్ ! ఏం చేసిందంటే ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ షాకిచ్చింది. తమ నిబంధనలను అతిక్రమిస్తున్నప్పటికీ.. ''ఆసక్తికరంగా' ఉండే పోస్టులకు 'ట్యాగ్ 'లు యాడ్ చేస్తామని ప్రకటించింది. ట్రంప్ పోస్ట్ చేసే ట్వీట్ల విషయంలో..

ట్రంప్‌కు ఫేస్‌బుక్ షాక్ ! ఏం చేసిందంటే ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 27, 2020 | 3:08 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఫేస్ బుక్ షాకిచ్చింది. తమ నిబంధనలను అతిక్రమిస్తున్నప్పటికీ.. ”ఆసక్తికరంగా’ ఉండే పోస్టులకు ‘ట్యాగ్ ‘లు యాడ్ చేస్తామని ప్రకటించింది. ట్రంప్ పోస్ట్ చేసే ట్వీట్ల విషయంలో  ట్విటర్ కూడా అలాగే వ్యవహరిస్తుందని, అందువల్ల తాముకూడా దాన్ని ఫాలో అవుతామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ వెల్లడించారు. అదే సమయంలో ద్వేషాన్ని రెచ్చగొట్టే యాడ్ లను నిషేధిస్తామని అన్నారు. జాత్యహంకారాన్ని, ద్వేషం లేదా హింసను ప్రేరేపించే కంటెంట్ ను ఫేస్ బుక్ నిషేధించాలన్న డిమాండ్ పెరుగుతోందన్నారు. ప్రత్యేకంగా ఒక దేశాన్ని, వ్యక్తులను, వారి రంగును, కుల మతాలను, జెండర్ ఐడెంటిటీని విమర్శించేట్టు ఉండే..లేదా వ్యక్తుల భద్రత, వారి ఆరోగ్యానికి భంగం కలిగించే పోస్టులను బ్యాన్ చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఇది తమ కొత్త పాలసీ అన్నారు. ఈ విధమైన కంటెంట్ తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తుందన్నారు. అమెరికాలో గత మే 25 న నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ హత్య అనంతరం దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఆ సందర్భంలో నిరసనకారులను ఉద్దేశించి ట్రంప్ చేసిన ట్వీట్లను ఫేస్ బుక్ వంటి సాధనాలు  పోస్ట్ చేశాయి. అయితే అవి జాతి వివక్షను, హింసను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని వాటిని తొలగించాలని అనేకమంది కోరినప్పటికీ ఫేస్ బుక్ అందుకు నిరాకరించింది. వాటిని తొలగించేందుకు మార్క్ జుకర్ బెర్గ్ అంగీకరించలేదు. దీంతో    తమ సంస్థ వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ పలువురు ఉద్యోగులు రాజీనామాలు చేశారు. తాజాగా జుకర్ బెర్గ్ తమ సంస్థ ప్రతిష్ట మసక బారుతున్నట్టు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందువల్లే నిబంధనలను అతిక్రమించే కంటెంట్ కి ఫుల్ స్టాప్ పెడతామన్నారు. అయితే ‘చదవదగిన’ వార్తలకు ట్యాగ్ లు జత చేస్తామని,  వీటి విషయంలో యూజర్లు  తమ కంటెంట్ ని షేర్ చేసుకోవచ్ఛునని ఆయన పేర్కొన్నారు.

కాగా-ట్విటర్ చేసిన ‘సరికొత్త ప్రయోగం’ ట్రంప్ కు, ఆయన మద్దతుదారులకు ఆగ్రహం కలిగిస్తోంది. తాజాగా వారు ఫేస్ బుక్ మీద కూడా ‘పడవచ్చు’!

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..